Bigg Boss Non Stop elimination: టాప్ కంటెస్టెంట్ అవుట్.. ఊహించని పరిణామంతో భోరుమన్న ఇంటి సభ్యులు
ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా సాగుతున్న బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలో మరో వారం ముగిసింది. ఉగాది స్పెషల్‌గా సాగిన బిగ్‌బాస్ ఓటీటీ తాజా ఎపిసోడ్‌లో రకరకాల ఎమోషన్స్ కనిపించాయి. ఉగాది పచ్చడి మాదిరిగా అనేక రుచులను గుర్తు చేసే విధంగా హోస్ట్ నాగార్జున అక్కినేని ఉత్సాహంగా ఆట, పాటలతో ఎపిసోడ్‌ను రసవత్తరంగా నడిపించాడు. కానీ ఈ వారం నామినేషన్‌లో ఉన్న సభ్యులను ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ.. చివరకు ఊహించని విధంగా టాప్ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయడం ప్రేక్షకులను షాక్ గురి చేసింది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లు
ప్రస్తుతం వారంలో అరియానా గ్లోరి, హమీదా ఖాతూన్, తేజస్వి మదివాడ, అనిల్ రాథోడ్, స్రవంతి చొక్కారపు, అఖిల్ సార్థక్ తదితరులు నామినేషన్‌లో ఉన్నారు. వారాంతపు ఎపిసోడ్‌ను ఆటపాటలతో కొనసాగిస్తూ హోస్ట్ నాగార్జున హోరెత్తించాడు. అఖిల్ సార్థక్, హమీదా, అనిల్‌ను ఒక్కో రౌండ్‌లో సేఫ్ చేశాడు.

ఉగాది స్పెషల్ రోజున
ఉగాది స్పెషల్‌గా సాగిన ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల్లో మార్చుకోవాల్సిన ఓ లక్షణాన్ని గురించి చెప్పమని ప్రతీ ఇంటి సభ్యుడికి ఛాయిస్ ఇచ్చాడు. అయితే అందరూ ఒక్కొక్కరిలో ఉండే తమకు నచ్చని విషయాన్ని చెబుతూ అది మార్చుకొంటే ఇక తిరుగే ఉండదని చెప్పారు. అయితే నటరాజ్ మాస్టర్ వంత వచ్చే సరికి తేజస్వి గురించి చెప్పబోతుండగా.. నన్ను నామినేట్ చేయడమే కాకుండా.. మళ్లీ నా గురించి కామెంట్ చేస్తున్నావా? అంటూ ప్రశ్నించింది.

ఫైనల్ ఎలిమినేషన్‌లో ఇద్దరు
అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో చివరకు ఇద్దరు అంటే.. స్రవంతి చొక్కారపు, తేజస్వి మదివాడ మిగిలారు. అయితే అందరూ స్రవంతి ఎలిమినేట్ కావడం తథ్యం అనుకొన్నారు. అయితే వారి ముందు రెండు ఫిష్ జార్స్ పెట్టి.. అందులో పసుపు పచ్చ నీళ్లు పెట్టారు. వారి చేతికి ఓ బాటిల్ ఇచ్చి అందులో పోయమని చెప్పారు. ఎవరి జార్ అయితే పసుపు నుంచి ఎరుపు రంగుకు మారుతుందో.. ఆ వ్యక్తి ఎలిమినేట్ అని నాగార్జున చెప్పారు. అయితే తేజస్వి మదివాడ జార్ ఎరుపు రంగులోకి మారడంతో ఎలిమినేట్ అని నాగార్జున చెప్పారు.

తేజస్వి మదివాడ ఎలిమినేషన్
తేజస్విని మదివాడ ఎలిమినేట్ అనే విషయాన్ని చెప్పగానే ఇంటి సభ్యులందరూ షాక్‌లోకి వెళ్లిపోయారు. అఖిల్, ముమైత్ ఖాన్, స్రవంతి చొక్కారపు, నటరాజ్ మాస్టర్ ఏడుస్తూ కనిపించారు. అయితే నటరాజ్ మాస్టర్ ఏడుస్తూ ఉండటం చూసి.. నామినేట్ చేసి ఎందుకు ఏడవడం అని నవ్వుతూ తేజస్వి చురకలు అంటించింది. అయితే అందరూ షాక్‌లో ఉండగా.. వారిని ఒక చోట కూర్చోబెట్టి.. నామినేషన్ అంటే చాలా సీరియస్‌గా ఉండాలి. ఇంక కొన్నినాళ్లు ఉండాల్సింది. కానీ నేను వెళ్లిపోతున్నాను అని తేజస్వి మదివాడ ఎమోషనల్ అయింది.

కోపంతో అప్పడు.. కోపం లేకుండా ఇప్పుడు
ఇంటి సభ్యులందరూ బాధతో సాగనంపక బిగ్‌బాస్ హౌస్ నుంచి తేజస్వి మదివాడ బయటకు వచ్చి నాగార్జునతో కలిసి వేదిక మీదకు వచ్చింది. అయితే నీ ఎలిమినేషన్ నాకు కూడా షాక్ కలిగించింది. నేను అనుకోలేదు అని నాగ్ అంటే.. అవును ఇంకా కొన్ని రోజులు ఉండాల్సింది అని చెప్పింది. అయితే గత సీజన్‌కు ఈ సీజన్‌కు తేడా ఏమిటంటే.. అప్పుడు కోపంతో ఉండటం మైనస్‌గా మారింది. ఇప్పుడు కోపం తగ్గించుకొని గేమ్ ఆటడం ఎవరికి నచ్చలేదు. అందుకే బయటకు వెళ్లాల్సి వస్తున్నది అని తేజస్వి చెప్పింది.
Recommended Video


నటరాజ్ మాస్టర్‌కు తీపి, చేదు లడ్డులు
నాగార్జునతో వేదిక మీద నుంచి తన 36 రోజుల జర్నీని చూసి ఎమోషనల్ అయింది. ఆ తర్వాత ఇంటి సభ్యులతో మాట్లాడింది. ఐదుగురికి తీపి లడ్డులు, మరో ఐదుగురికి చేదు లడ్డులు ఇవ్వమని హెస్ట్ నాగార్జున అడిగితే.. అందరికి సమానంగా పంచింది. చివరకు నటరాజ్ మాస్టర్‌కు తిపి, చేదు లడ్డులు ఇచ్చారు. అనంతరం బిగ్‌బాస్ నాన్ స్టాప్ నుంచి బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











