కమిట్ మెంట్లు ఎలా అడుగుతారంటే.. వరుసగా 10 సార్లు.. నన్ను కూడా
టాలీవుడ్ యంగ్ హీరోయిన్, బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఫేమ్ తేజస్వి మదివాడ తెలుగు ప్రేక్షకుల్లో కాస్తా మంచి గుర్తింపునే దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు - విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో గీతచెల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె మహేశ్ బాబుతో 'ఇంకోసారి' అని చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుకు ఉండిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఐస్ క్రీమ్' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది.
తేజస్వి మదివాడ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ద్వారా బుల్లితెర ఆడియెన్స్ కు మరింతగా దగ్గరైంది. హౌజ్ లో ఆమె నడుచుకున్న తీరు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసింది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వంతో సెన్సేషన్ గా మారింది. టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సంచనలంగా మారింది. అప్పటి నుంచి బుల్లితెరపై పలు గేమ్ షోస్స్ లో కనిపిస్తూ సందడి చేస్తూనే వస్తోంది. మరోవైపు తనకు సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది.

తాజాగా యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ శివతో ఒక ఇంటర్వ్యూ చేసింది. తన వ్యక్తిగత విషయాలను నిర్మోహమాటంగా ఆ ఛానెల్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే తేజస్వి మదివాడ టాలీవుడ్ లో 'కమిట్ మెంట్'లపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ... ఇప్పటికీ టాలీవుడ్ లో కమిట్ మెంట్ సమస్య ఉంది. అది సినీ పరిశ్రమలోనే కాదు. అన్నీ రంగాల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా పాకి ఉండింది. కొందరైతే హీరోయిన్లను ఈజీగా కమిట్ మెంట్లను అడిగేస్తూ ఉంటారు. అసలు వాళ్లు కమిట్ మెంట్లు అడిగే విధానం చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ముందుగా పరిచయం చేసుకుని చేతులను తాకుతూ ఉంటారు. అలా 10ల సార్లు తాకుతూనే ఉంటారు. దాంతో వారి మధ్య క్లోజ్ నెస్ పెరిగేలా చేసి కమిట్ మెంట్లు అడుగుతారు. నా కెరియర్ ప్రారంభంలో నేను కూడా కమిట్ మెంట్ సమస్యలను ఎదుర్కొన్నాను. సినిమా ఆఫర్ల కోసమని వెళితే మీరు సాయంత్రం డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ గారితో డిన్నర్ చేయాల్సి ఉంటుందని చెప్పేవారు. నాకు అప్పట్లో అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత నా మాట విధానానికి అసలు అలాంటి సమస్య నా దగ్గరికి రావడమే లేదు... అని చెప్పుకొచ్చింది.
ఇక కమిట్ మెంట్లపై ఎప్పటికీ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. అయితే నటీనటులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టాలీవుడ్ లోని సీనియర్ నటులు చెబుతూనే వస్తున్నారు. మీరు ధైర్యంగా, ప్రొఫెషన్ పట్ల నిబద్ధతగా, నిజాయితీగా ఉంటే ఏ కమిట్ మెంట్ భూతం మిమ్మల్ని ఏం చేయలేదని యంగ్ యాక్ట్రెస్ కు సీనియర్ నటులు, టాలీవుడ్ ప్రముఖులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే వస్తున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్లు హాయిగా వర్క్ చేసుకోనే వాతావరణం కోసం అందరూ సహకరించాలని కోరుతున్న సంగతి తెలిసిందే. ఇక తేజస్వి మదివాడ ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2' షోలో సందడి చేస్తోంది.


Click it and Unblock the Notifications











