బిగ్‌బాస్ నుంచి తేజస్వి ఔట్.. దొంగ నా కొడుకు అని కామెంట్.. కన్నీటి పర్యంతమైన సామ్రాట్
Recommended Video

బిగ్‌బాస్ హౌస్‌లో కీలకమైన ఎలిమినేషన్ రోజైన ఆదివారం ఆసక్తికరమైన పరిణామాలతోపాటు కొన్ని విషాదఛాయలు కనిపించాయి. ఎలిమినేషన్ డే కావడంతో అందరూ దానిపైనే చర్చ మొదలుపెట్టారు. అలా సెలబ్రిటీలు మాట్లాడుకుంటుండగానే మంచు లక్ష్మీ ఇంట్లోకి రావడంతో సందడిగా మారింది. ఈ వారం మంచు లక్ష్మీ ఒకరిని ఎలిమినేట్ చేయడం విశేషం.

ఎలిమినేషన్‌పైనే చర్చ
ఆదివారం ఉదయమే తేజస్వి, సామ్రాట్ ఎలిమినేషన్ గురించే మాట్లాడుకొన్నారు. నేనే వెళ్లిపోతాను అని సామ్రాట్ అనగా.. లేదు నేనే వెళ్లిపోతాను అని తేజస్వి చెప్పింది. ఇద్దరం షూటింగ్‌లో ఉన్నాం అనుకొందాం. ఒకవేళ నీవు వెళ్లిపోతే. నీ షెడ్యూల్ అయిపోయింది. నీవు వెళ్లావనుకొంటా. నాది పూర్తయినప్పుడు నేను బయటకు వస్తాను కదా అని సామ్రాట్ అన్నారు.

ఇంట్లోకి మంచు లక్ష్మీ
టెలివిజన్‌లో ఇలా చూస్తూనే ఇంట్లోకి సామ్రాట్ వైఫ్ వచ్చింది అంటూ మంచు లక్ష్మీకి వెల్‌కమ్ చెప్పారు. వైఫ్ ఆఫ్ రామ్ చిత్ర ప్రమోషన్ కోసం వచ్చిన లక్ష్మీ ఇంట్లోకి వెళ్లి అందరికి షాక్ ఇచ్చింది. మంచు లక్ష్మీని చూడగానే ఇంటి సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

సామ్రాట్‌పై మంచు లక్ష్మీ ఫైర్
ఇంట్లోకి వెళ్లగానే సామ్రాట్‌పై మంచు లక్ష్మీ ఫైర్ అయ్యారు. సినిమా ప్రమోషన్‌కు రాకుండా బిగ్‌బాస్ ఇంట్లోకి చెప్పకుండా వస్తావా అని నిలదీసింది. వైఫ్ ఆఫ్ రామ్ సినిమా బ్లాక్‌బస్టర్ అయిందని చెప్పడంతో సామ్రాట్ సంతోషంలో మునిగిపోయాడు.

తేజస్విని అవుట్ చేసిన మంచు లక్ష్మీ
మంచు లక్ష్మీ ఇలా మాట్లాడుతుండగానే నాని ఎలిమినేషన్ ప్రక్రియకు తెరలేపారు. నామినేషన్‌లో ఉన్న తేజస్వి, సామ్రాట్‌లో ఎవరు వెళ్తున్నారో మంచు లక్ష్మీ చెబుతుందని నాని వెల్లడించారు. దాంతో సామ్రాట్, తేజస్విని ఇంటి నుంచి బయటకు పంపించే బాధ్యతను ఆమె చేపట్టారు. నాని సూచనతో తేజస్వి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారని, ఐదు నిమిషాల్లో సూట్‌కేస్ సర్దుకోవాలని ఆమె సూచించారు.

ఒక్కొక్కరి గురించి తేజస్వి
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తూ ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పి వారికి ఇలా మార్కులు వేసింది.
మోస్ట్ మిస్ అండర్‌స్టూడ్.. కానీ ది బెస్ట్ 10/10
కౌశల్ విషయంలో నేను ఎప్పుడు తప్పుకాదు. 5/10
అమిత్‌ను దొంగ నా కొడుకు 8/10
తనీష్ గురించి నా బిడ్డ ఎప్పుడూ కోపంతోనే ఉంటేనే నాకు ఇష్టం 10/10
నందిని రాయ్... బిగ్‌బాస్‌లోనే కాదు బయట కూడా నాకు ఫ్రెండ్‌గానే ఉంటుంది 8/10

గణేష్.. లడ్డేష్.. బ్రెడ్డేష్
రోల్ రైడా.. ఇంట్లో బాంబులు వేస్తాడు అందుకే బాంబర్ మ్యాన్ అంటాను.. 9/10
దీప్తి సునైనా ముద్దొచ్చే అలకల రాణి 8/10
గీతా మాధురి.. మొదట్లో అపార్థం చేసుకొన్నప్పటికీ ప్రస్తుతం ఇంటిలో మంచి అమ్మ 8/10
బాబు గోగినేని.. ఆయన మోస్ట్ నాలెడ్జ్ పర్సన్. ఆయన వల్ల నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది 10/10
దీప్తి నల్లమోతు.. ఆమెను బబుల్ గర్ల్ అని పిలుస్తాను.. 8/10
గణేష్.. లడ్డేశ్.. బ్రెడ్డేష్.. హౌలేష్ 8/10

సామ్రాట్ రెడ్డి కన్నీటి పర్యంతం
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ తేజస్వి అవుట్ కావడంతో సామ్రాట్ షాక్ తిన్నాడు. ఆ దిగ్బ్రాంతి నుంచి తేరుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. కంట నీరు పెట్టుకొన్న సామ్రాట్‌ను తనీష్, రోల్ రైడా ఓదార్చారు. అయినా తేజస్విని ఇంటి నుంచి బయటకు వెళ్లేవరకు సామ్రాట్ ఏడుస్తూనే ఉన్నాడు.

సామ్రాట్‌తో ప్రేమలో పడటం వల్లే
బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తేజస్విని నానితో మాట్లాడింది. గేమ్ ఆడటం చాలా కష్టమైన పని. ఏదో అనుకొన్నాను కానీ అది సాధ్యపడలేదు. నేను నాలా ఉండాలనుకొన్నాను. కానీ ఇంట్లో రిలేషన్స్, ప్రేమలో పడటంతో గేమ్ ఆడటం సాధ్యపడలేదు. ప్రేమలో ఒకరిని మోసగించకూడదని నిర్ణయించుకొన్నాను. అందుకే గేమ్‌ను సరిగా ఆడలేక బయటకు వెళ్తున్నాను.

గణేష్‌పై తేజస్వి బిగ్‌బాంబ్
బిగ్‌బాస్ ఎలిమినేషన్‌లో భాగంగా బిగ్‌బాంబ్‌ను గణేష్‌పై వేసింది. బిగ్‌బాంబు ప్రకారం ఇకనుంచి పాలపీకలో నీళ్లు తాగాలి అని చెప్పింది. చివర్లో కౌశల్‌కు ఓ మాట చెప్పింది. అదేమిటంటే.. కౌశల్ నీవు గేమ్ గెలుస్తావో ఏమో కానీ.. నేను ఇప్పటికే ఇంట్లో అందరి మనుసులు గెలిచాను అని తేజస్వి చెప్పింది.


Click it and Unblock the Notifications











