twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మాందంతో కలిసి టీవీ షో చేయబోతున్న బిగ్‌బాస్2 కంటెస్టెంట్ తేజస్వి!

    |

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో అల్లరి పిల్లగా, సెక్సీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న తేజస్వి మదివాడ.... తను చేసిన కొన్ని పనుల వల్ల ప్రేక్షకుల మద్దతు కోల్పోయి ఊహించినదానికంటే ముందుగానే షో నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా బయటకు రావడం బిగ్ బాస్ టైటిల్ కోల్పోయినా... అంతకంటే పెద్ద ఛాన్స్ మొరొకటి దక్కించుకుంది.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తేజస్వి మదివాడ హెస్ట్‌గా త్వరలో ఓ కామెడీ టీవీ షో ప్రారంభం కాబోతోందట. బిగ్ బాస్ ఇంట్లో తేజస్వి చలాకీ తనం, అల్లరి చేష్టలు చేసి ఆమెను హోస్ట్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

    Tejaswi Madivada to host a comedy show

    ది గ్రేట్ తెలుగు లాఫర్ ఛాలెంజ్ మాదిరిగా సాగే ఈ కామెడీ షోకు.... టాలీవుడ్ కామెడీ డాన్ బ్రహ్మానందం జడ్జిగా వ్యవహరించబోతున్నారట. త్వరలోనే ఈ షో 'స్టార్ మా' ఛానల్‌లో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

    అయితే ఈ కామెడీ షో కాన్సెప్టు ఏమిటి? ఎలా సాగుతుంది? అనే వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. బిగ్ బస్ 2 టైటిల్ దక్కించుకునే అవకాశం కోల్పోయిన తేజస్వికి ఈ టీవీ షో రూపంలో అంతకు మంచి అవకాశం దొరికిందని చెప్పొచ్చారు.

    సినిమా నటిగా కెరీర్ మొదలు పెట్టిన తేజస్వి హీరోయిన్‌గా ఎదగాలని ప్రయత్నించి విఫలమైంది. బిగ్ బాస్2లో పాల్గొనడం ద్వారా టీవీ రంగం వైపు దృష్టిసారంచింది. కామెడీ షో హోస్ట్‌గా ఆమె సక్సెస్ అయితే ఆమెకు టీవీ రంగంలో మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పొచ్చారు.

    English summary
    According to the latest updates, Tejaswi will be hosting this soon-to-commence comedy show on Star Maa channel. The show will also have star comedian Brahmanandam as the judge.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X