Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెరైటీ ఫోటో షూట్.. ఎందుకీ పాట్లు.. బిగ్‌బాస్ బ్యూటీ రచ్చ
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఐస్‌క్రీమ్ వంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది తేజస్వీ మడివాడ. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా రెండో సీజన్లో నానా రచ్చ చేసి బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. బిగ్‌బాస్ షోతో ఎంత మంచి పేరు వచ్చిందో.. అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా వచ్చింది. అయితే తేజస్వీ మాత్రం సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ సెగలు రేపుతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్..
తేజస్వీ మడివాడ బిగ్ బాస్ షో అనంతరం సోషల్ మీడియాలో విపరతీంగా ఫేమస్ అయింది. హౌస్‌లో హాట్ హాట్‌గా కనిపించి గ్లామర్ డోస్ తగ్గకుండా చూసుకుంది. బయటకు వచ్చాక కూడా అంతే స్థాయిలో రచ్చ చేస్తూనే వస్తోంది. నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది.
వెబ్ సిరీస్‌లతో బిజీ..
తేజస్వీ బిగ్ బాస్ తరువాత సినిమా అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. షో నుంచి బయటకు వచ్చాక చేసిన లాఫ్టర్ కామెడీ షో, హోస్టింగ్ రెండూ బెడిసి కొట్టాయి. దీంతో ఈ అమ్మడు వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. కమిట్మెంట్ పేరుతో రాబోతోన్న వెబ్ సిరీస్ పోస్టర్లతో ఈపాటికే హల్చల్ చేసింది.
నెటిజన్లతో ముచ్చట్లు..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తేజస్వీ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. వారంలో కనీసం రెండు మూడు సార్లు చిట్ చాట్ చేస్తుంటుంది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు నిర్మోహమాటంగా సమాధానాలు ఇస్తుంది. వ్యక్తిగత విషయాలపైనా ఏమాత్రం సంకోచించకుండా బోల్డ్ ఆన్సర్స్ ఇస్తుంది.
పెళ్లిపై స్పందన..
తాజాగా తేజస్వీ నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ పెళ్లిపై అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ‘నాకు ఇంకా పెళ్లి కాలేదు.. అసలు అలాంటి ఉద్దేశ్యమే లేదు' అని సమాధానమిచ్చింది. పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటావా? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. ‘తప్పుడు వ్యక్తిని చేసుకునే బదులు ఇలా ఉంటేనే బెటర్ కదా?' అని పేర్కొంది.
Recommended Video
వెరైటీ ఫోటోషూట్..
తాజాగా తేజస్వీ ఓ భిన్నమైన ఫోటో షూట్ చేసింది. లూజ్ ప్యాంట్ వేసుకుని రచ్చ చేసింది. ప్యాంట్ కొంచెం కొంచెంగా విప్పినట్టు ఉన్న తేజస్వీ స్టిల్స్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పెంచుతోంది. అయితే కొందరు మాత్రం ఎందుకీ పాట్లు అంటూ నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా తేజస్వీ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద చిచ్చునే పెట్టాయి.