విభిన్న భంగిమలతో ఫోజులు.. బిగ్‌బాస్ బ్యూటీ సొగసుల వల.. తేజస్వీ స్టన్నింగ్ లుక్ వైరల్
వెండితెరపై, బుల్లితెరపై మెరిసిన తెలుగు అందం తేజస్వీ మడివాడ. వెండితెరపై అడపాదడపా చిత్రాలతో మెప్పించిన తేజస్వీ బిగ్‌బాస్ షోతో బాగా ఫేమస్ అయింది. అప్పటి వరకు ఉన్న క్రేజ్ కంటే ఎక్కువగా పాపులార్టీ వచ్చింది. అయితే క్రేజ్ వచ్చింది గానీ కాస్త నెగెటివిటీ కూడా పెరిగింది. హౌస్‌లో మాట్లాడిన మాటలు, కంటెస్టెంట్లతో పెట్టుకున్న గొడవలు, చేసిన ఆరోపణలు తేజస్వీకి చెడ్డ పేరును తీసుకొచ్చాయి. అందుకే బిగ్ బాస్ తరువాత ఆమెకు అవకాశాలు కూడా తగ్గాయి.

వర్కౌట్ కానీ షోలు..
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఓ లాఫ్టర్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది తేజస్వీ. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. బ్రహ్మానందం లాంటి లెజెండ్ ఉన్నా గానీ షో ఫ్లాప్ అవ్వడానికి కారణం మాత్రం తేజస్వీ మూటగట్టుకున్న నెగెటివిటీ. అయితే సినీ అవకాశాలేమో గానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది.

ఫోటోషూట్లతో రచ్చ..
తేజస్వీ నిత్యం ఫోటోషూట్‌లతో రచ్చ చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఇలా హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తూ ఉంటుంది. ఇక బోల్డ్ వెబ్ సిరీస్‌లోనూ తన దైన శైలిలో వేడి పుట్టిస్తోంది.

సంచలన కామెంట్స్..
తేజస్వీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది నన్ను పడక గదిలోకి వస్తావా?' అని అడిగారని తెలిపింది. దానికి కమిట్‌మెంట్ పేరు పెట్టిన విషయం అందరికీ తెలిసిందేనని అందువల్లనే వాటిని ఒప్పుకోలేక తాను సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నానని చెప్పుకొచ్చింది.

చొక్కా విప్పేసి..
తన వస్త్ర ధారణతో పాటు తనపై ఉన్న అభిప్రాయం కూడా మారుతూ ఉంటే అలాంటి ఓపినియన్ తనకు అవసరం లేదంటూ ఓ క్యాప్షన్ పెట్టి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో షర్ట్ విప్పేసి క్లీవేజ్ షోతో సెగలు రేపుతోంది. అందాల వల వేసినట్టు కుర్రకారు చిక్కుకుపోయారు.
Recommended Video

కమిట్‌మెంట్ వెబ్‌సిరీస్..
తేజస్వీ మడివాడకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై మస్త్ గిరాకీ ఉంది. బోల్డ్ పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయక పోవడం ఇందుకు కారణం. కమిట్‌మెంట్ వెబ్ సిరీస్ పోస్టర్లతో నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇలాగే మరికొన్ని వెబ్ సిరీస్‌లను కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











