Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటావా?.. అసలు ఆడదానివేనా?.. నెటిజన్లకు తేజస్వీ ఇంట్రెస్టింగ్ రిప్లై
వెండితెరపై అడపాదడపా మెరిసిన తేజస్వీ.. బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొన్న తేజస్వీకి ఎంత పాపులార్టీ వచ్చిందో.. అంతే స్థాయిలో నెగెటివిటీ వచ్చింది. కౌశల్‌పై నిత్యం నోరు జారడం, ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం, నోటిని అదుపులో పెట్టుకోలేకపోవడం వంటి వాటితో తేజస్వీ మధ్యలోనే ఇంటి బాట పట్టింది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది.
భర్త అంటూ ఓ ఫోటో..
తేజస్వీ రీసెంట్గా తన 29వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంది. అంతా బాగానే ఉన్నా ఓ ఫోటోను షేర్ చేస్తూ.. తన భర్త అని ఓ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆమెకు పెళ్లి అయిపోయిందని అంతా భావించారు. తాజాగా ఆమె నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ తన ప్రేమ, పెళ్లి సంగతులపై ఓ క్లారిటీ ఇచ్చింది.
నెటిజన్లతో చిట్‌చాట్..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తేజస్వీ నిత్యం హాట్ హాట్ ఫోటోలతో అందర్నీ రెచ్చగొడుతూ ఉంటుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు ఫాలోవర్లతో ముచ్చట్లు కూడా పెడుతుంది. వారు అడిగే ప్రశ్నలకు కూల్‌గా సమాధానాలు ఇస్తుంది. తాజాగా అలాగే చిట్ చాట్ చేస్తుండగా.. ఆమె పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదు..
మొదటగా మీకు పెళ్లి అయిందా? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దెబ్బకు ఆశ్చర్యపోయినట్టుగా ఓ ఎమోజీని పెట్టి.. నవ్వేసింది. ‘నాకు ఇంకా పెళ్లి కాలేదు.. అసలు అలాంటి ఉద్దేశ్యమే లేదు' అని సమాధానమిచ్చింది. పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటావా? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. ‘తప్పుడు వ్యక్తిని చేసుకునే బదులు ఇలా ఉంటేనే బెటర్ కదా?' అని పేర్కొంది.
నువ్ అమ్మాయివేనా?
క్లోజప్ చేస్తున్నావా? అని మరో నెటిజన్ ప్రశించగా.. ‘అవును అంకితా.. అందరితో క్లోజప్, బ్రేకప్ అదే జీవితంలో ఓ పార్ట్'అని చెప్పుకొచ్చింది. ఆర్ యూ గర్ల్ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘దాని గురించి నేను చాలా ఆలోచించాను. మానవులందరికీ ఒకే శరీరం ఉంది. అందులోనే ఆడ, మగ ఇద్దరూ ఉన్నారు. అయితే మీరు దేన్ని ఎంచుకోవాలని అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట చేసుకోవచ్చు. మీరు ఎలా ఫీల్ అయింతే అలా. నా విషయానికొస్తే నేను అమ్మాయినే'అని కౌంటర్ వేసింది.
Recommended Video
అప్పుడే పెళ్లి చేసుకుంటా..
మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని గతంలో ఓ నెటిజన్ అడిగితే.. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు కనుక్కుంటే అప్పుడే చేసుకుంటానని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడేమో అసలు పెళ్లే చేసుకోనని చెప్పుకొస్తోంది. ఏది ఏమైనా తేజస్వీకి పెళ్లి అంటే అయిష్టంగానే ఉన్నట్టు కనిపిస్తోంది.