Bigg Boss Non Stop బ్యాంకాక్‌ బీచ్‌లో అలా.. చేతిలో సిగరెట్‌తో తేజస్విని, ముమైత్ దమ్ మారో దమ్

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షో నాన్ స్టాప్ రసవత్తరంగా సాగుతున్నది. కంటెస్టెంట్లు తమ పదునైన మాటలు, బోల్డ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నాన్ స్టాప్ షోలో ముమైత్ ఖాన్, తేజస్విని మదివాడ, అరియానా గ్లోరి, సరయు, అషు రెడ్డి, శ్రీ రాపాక తమదైన శైలిలో హాట్ కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 28వ తేదీన ప్రసారమైన ఈ షోలో తేజస్విని, ముమైత్ ఖాన్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో

బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో

బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో తొలిసారి 24 గంటలపాటు లైవ్ షోను ప్రదర్శించడంతో అభిమానులకు కిక్ కలుగు జేస్తుంది. ఈ షోలో అరియానా గ్లోరి , సరయు, అశురెడ్డి, తేజస్వి మదివాడ, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్, బిందు మాధవి, హమీదా ఖాతూన్, మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, మిత్రా శర్మ, యాంకర్ శివ, ఆర్జే చైతూ, స్రవంతి చొక్కారపు, అజయ్ కుమార్ కథ్వురార్, అనిల్ రాథోడ్ రావడంతో అభిమానుల జోష్ హద్దు లేకుండా పోయింది.

తేజస్విని ఫీల్ గుడ్ లవ్ ట్రాక్‌తో

తేజస్విని ఫీల్ గుడ్ లవ్ ట్రాక్‌తో


గత బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్‌లో టైటిల్‌కు అర్హత ఉన్న కంటెస్టెంట్లలో ఒకరైన తేజస్విని ఆరంభంలో బాగానే ఆకట్టుకొన్నది. అయితే సమ్రాట్, తనీష్, సునైనాతో జతకట్టిన ఈ అందాల భామ ఫీల్ గుడ్ లవ్ ట్రాక్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో గేమ్‌ను అంచనా వేయలేకపోయిన తేజస్విని అర్ధాంతరంగా ఎలిమినేట్ అవ్వడం బిగ్‌బాస్ అభిమానులకు షాక్ కలిగించింది.

మరోసారి బిగ్‌బాస్ అభిమానుల చేరువగా

మరోసారి బిగ్‌బాస్ అభిమానుల చేరువగా


అయితే బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత తేజస్విని వరుసగా మంచి ఆఫర్లు దక్కించుకొన్నది. ఆచీతూచీ ఆఫర్లను చేజిక్కించుకొంటున్న ఈ భామ మరోసారి బిగ్‌బాస్ నాన్ స్టాప్‌ షో ఆఫర్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సారి బిగ్‌బాస్ ట్రోఫిని గెలుచుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తనకు నచ్చినట్టుగా నాన్‌స్టాప్‌లో ఉంటూ తేజస్విని తడాఖాను చూపిస్తున్నది.

బ్యాంకాక్ బీచ్‌లో అంటూ..

బ్యాంకాక్ బీచ్‌లో అంటూ..


బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలో ఫిడబ్రవరి 28వ తేదీన స్కోకింగ్ జోన్‌లో సిగరెట్‌ను రాజసంగా తాగుతూ ఫుల్ కంటెంట్ ఇచ్చింది. సిగరెట్ తాగుతూ బ్యాంకాక్‌లో బీచ్‌లో అంటూ ముమైత్‌తో ఏదో చెప్పబోయింది. అయితే ఆమె మాటలపై బిగ్‌బాస్ బీప్స్ వేసి కంట్రోల్ చేశాడు. అయితే 50 ఏళ్లు వచ్చిన తర్వాత అంటూ బోల్డ్‌గా మాట్లాడటం ఆసక్తిని కలిగించింది.

సిగరెట్ల పోటీ పెట్టుకొందామా అంటూ..

సిగరెట్ల పోటీ పెట్టుకొందామా అంటూ..


అయితే తేజస్వినితో కలిసి ముమైత్ కూడా సిగరెట్లతో దమ్ము మీద దమ్ము కొడుతూ.. కేక పెట్టించారు. మనం సిగరెట్లు తాగే పోటీ పెట్టుకొందామా? అంటూ ముమైత్‌ను తేజస్విని కవ్వించింది. అయితే ముమైత్, తేజస్విని బోల్డ్ వ్యవహారం ఈ షోకు స్పెషల్ ఎట్రాక్షన్ కొట్టింది. ఇక మున్ముందు వీరిద్దరి రచ్చ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X