కొత్త స్టైల్, వెరైటీ లుక్.. ఫోటోలతోనే సెగలు పుట్టిస్తూ బిగ్ బాస్ బ్యూటీ రచ్చ
వెండితెరపై, బుల్లితెరపై ఎంతో మంది అభిమానాన్ని మూటగట్టుకుంది తేజస్వీ మదివాడ. వెండితెరపై సహాయక పాత్రల్లో, హీరోయిన్ పాత్రల్లోనూ అందర్నీ మెప్పించింది. అయితే బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెరపై మాత్రం నానా రచ్చ చేసింది. అప్పటి వరకు తేజస్వీని అందరూ ఒకలా చూస్తూ.. షో అనంతరం ఆమెపై ఉన్న ఇమేజ్ మొత్తం మారిపోయింది. బిగ్ బాస్ షో అనంతరం తేజస్వీకి అంతగా అవకాశాలు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకుంది.

షో తరువాత అవకాశాలు..
బిగ్ బాస్ షోలో వచ్చిన నెగెటివిటీ కారణంగా తేజస్వీకి అంతగా అవకాశాలు రాలేదు. తేజస్వీ యాంకరింగ్ చేసిన లాఫ్టర్ షో కూడా వర్కౌట్ కాలేదు. ఇక వెండితెరపైనా అవకాశాలు మునిపటిలా వరించలేదు. దీంతో ఆమె ఓటీటీ ఫ్లాట్‌ఫాంను నమ్ముకుంది.

బోల్డ్ కంటెంట్..
తేజస్వీ ప్రస్తుతం బోల్డ్ కంటెంట్‌ను నమ్ముకుంది. ఓటీటీ, వెబ్ సిరీస్‌ల హవా పెరుగుతున్న నేపథ్యంతో తేజస్వీ అటు వైపు జంప్ చేసింది. ప్రస్తుతం కమిట్ మెంట్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈపాటికే విడుదల చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో కుంపటిని పెట్టాయి.

లాక్ డౌన్ స్పెషల్..
తేజస్వీ ఈ లాక్ డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకుంది. వర్కౌట్లు చేసుకుంటూ సరదాగా గడిపేసింది. మధ్యమధ్యలో నెటిజన్లతో ముచ్చిటిస్టూ.. హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరించేది. ఇక ఈ అమ్మడికి డ్యాన్సులంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

డ్యాన్స్ క్లాసులు..
తేజస్వీ మంచి డ్యాన్సర్ అని అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలోనూ తన డ్యాన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలోనూ తేజస్వీ తన డ్యాన్సులను ఇంకా మెరుగు పరుచుకుంది. రోజు సాయంత్రం ఓ గంటపాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
Recommended Video

వెరైటీ హెయిర్ స్టైల్..
ప్రస్తుతం తేజస్వీ కొత్త లుక్‌లోకి మారింది. జుట్టును పొట్టిగా కత్తిరించుకుని బేబీ డాల్‌లా మారిపోయింది. ఇక క్లీ వేజ్ షోతో సెగలు పుట్టించేలా ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం తేజస్వీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











