Bigg Boss Telugu : బిగ్ బాస్ వల్ల నా జీవితం నాశనం.. పైగా అలాంటి ముద్ర

నటి తేజస్వి మదివాడ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తగ్గించుకున్నారు . అంతకన్నా ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత నుంచి తేజస్వి మదివాడకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయి. నటిగా మనకు వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకుంటూ కెరియర్ ను ముందుకు తీసుకెళ్తోంది.

Tejaswi madivada Shocking Comments about Bigg Boss Telugu Reality Show

సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోల్లోనూ మెరుస్తూ సందడి చేస్తుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తేజస్వి మదివాడ నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 తో బుల్లితెర పేక్షకులకు మరింతగా దగ్గర అయింది. అయితే రీసెంట్ గా తేజస్వి మదివాడ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో బిగ్బాస్ తెలుగు రియాల్టీ షో సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ సీజన్ 2 తర్వాత తన కెరియర్ నాశనమైందని పరోక్షంగా చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తనకు చాలా క్రేజ్ దక్కిన మాట వాస్తవం అయినప్పటికీ.. తనకు కాస్త నెగటివ్ రెస్పాన్స్ వచ్చిందని అభిప్రాయపడింది. ఆ షో నుంచి బయటికి వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ తనను వదిలి వెళ్లాడని బాధపడింది. ఎందుకో తనపై నెగటివ్ ప్రచారం బాగా జరిగిందని చెప్పుకొచ్చింది. తన మాటలు ప్రేక్షకులకు ఎందుకనో బోల్డ్ గా అనిపించాయని చెప్పింది. ఆ తర్వాత నుంచి తనను బోల్డ్ గా చూస్తున్నారని వివరించింది. కానీ తను ఆన్ స్క్రీన్ ఒకలా, ఆఫ్ స్క్రీన్ మరొకలా ప్రవర్తించడం రాదని తెలియజేసింది.

చాలామంది తనను బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత పలు రకాలుగా కామెంట్లు చేశారని చెప్పింది. తనకు వచ్చిన క్రేజ్ ను సరిగా వినియోగించుకో లేకపోయానని అన్నారని వివరించింది. కానీ జరిగిన విషయాలు వేరు అని చెప్పే ప్రయత్నం చేసింది. ఎవరు ఏమనుకున్నా తనకు నచ్చినట్టుగా ఉండడం ముఖ్యమని భావిస్తున్నట్లు చెప్పింది. ఇక ఇండస్ట్రీ లో ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అది అంత ఈజీ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది.

ఇక తేజస్వి మదివాడ బిగ్ బాస్ సీజన్ 2 కు ముందే నటిగా పలు చిత్రాలు చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఐస్ క్రీమ్ అనే చిత్రంతో హీరోయిన్గా తొలి చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లోని పలు చిత్రాల్లో సపోర్టెడ్ రోల్స్ లో మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి లేడీస్ సీజన్ 2 గేమ్ షోలో లేడీ కంటెస్టెంట్ గా అలరిస్తోంది. ప్రతి టాస్క్ లో చురుకుగా పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X