Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌కు అలాంటి వ్యాధి.. ట్రీట్‌మెంట్ కూడా ఇవ్వట్లేదు. తేజూ షాకింగ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో కంటెస్టెంట్లు.. ముఖ్యంగా టాప్ 5లోకి వచ్చే హౌస్ మేట్స్ గురించి అందరికీ తెలిసిందే. దాదాపుగా 13 వారాల నుంచి ఇంట్లో ఉంటూ తమ అసలు వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్న వాళ్లు ఇంట్లో చాలానే సమస్యలు పడుతున్నారట. ముఖ్యంగా ఇంట్లో ఉండి ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్న వాళ్లలో తొలి వాడు శివాజి. ఆయన చేయి నొప్పి ఉందని అందరి ముందే చెప్పడం... మొన్నటి వరకూ కట్టు కట్టుకొని ఉండడంతో అందరికీ ఆ విషయం తెలిసింది. అయితే ఇటీవలే అమర్ దీప్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదనే విషయం వెలుగులోకి వచ్చింది.

కానీ షోలో ఉండగా ఆయన ఎప్పుడూ రోగిలా ప్రవర్తించలేదు. తనకు నొప్పి ఉందని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని కూడా ఏ ఒక్కరికీ చెబుతూ కనిపించలేదు. ఇలా ఆయనకు అనారోగ్య సమస్య ఉన్నట్లు తెలియలేదు. కానీ గత వారంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వార్త ఫుల్ వైరల్ అయింది. అయితే ఇంతకాలం మీడియా ముందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆయన ఆరోగ్యం గురించి చెప్పలేదు. కానీ తాజాగా అమర్ దీప్ ఆరోగ్య సమస్యల గురించి ఆయన భార్య తేజస్విని స్పందించింది. ఆయన నిజంగానే ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని వివరించింది.

 Tejaswini Clarrity About Her Husband Amardeep Health Condition in Bigg Boss Telugu 7 Check Details

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందే అన్ని పరీక్షలు చేయించగా.. ఆయనకు పలు సమస్యలు ఉన్నట్లు తెలిసిందని తేజస్విని చెప్పింది. ముఖ్యంగా మజిల్ గ్రోత్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చింది. ఆయన శరీరంలో సరిపడా విటామిన్లు లేక.. మజిల్ గ్రోత్ జరగట్లేదని స్పష్టం చేసింది. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆయన అదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారని.. కానీ అది చెబితే సింపథీ గేమ్ అంటారని ఎవరికీ తెలియకుండా చూసుకుంటున్నారని చెప్పుకొచ్చింది. ప్యామిలీ వీక్ లో భాగంగా తాను హౌస్ లోకి వెళ్లినప్పుడు కూడా అమర్ వీపు భాగంలో నొప్పి ఉన్నట్లు చెప్పాడని... ఇప్పటికీ తాను ఓ ఆంట్ మెంట్ పంపిస్తున్నట్లు వివరించింది.

 Tejaswini Clarrity About Her Husband Amardeep Health Condition in Bigg Boss Telugu 7 Check Details

రాత్రి పూట పడుకున్నాక ఆయన ఆ ఆయింట్ మెంట్ పెట్టుకున్నారని.. కానీ సింపథీ గేమ్ మాత్రం ఆడట్లేదని ఆయన గురించి క్లారిటీ ఇచ్చింది. అయితే తామిద్దరూ కలిసి డ్యాన్స్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ఆ సమస్య ఎదురైందని.. దాన్ని నుంచి ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారని తేజస్విని వెల్లడించింది. అలాగే తాను కూడా లోబీపీ సమస్యతో బాధ పడుతున్నట్లు వివరించింది. కానీ ఏరోజూ తాము ఈ సమస్యల గురించి చెప్పి సింపథీ గేమ్ ఆడట్లేదని చెప్పుకొచ్చింది.

 Tejaswini Clarrity About Her Husband Amardeep Health Condition in Bigg Boss Telugu 7 Check Details

షో మొదటి వారంలో బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టిన అమర్ దీప్ యే విన్నర్ గా నిలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవ పెట్టుకుని ఫుల్ నెగిటివిటీ తెచ్చుకున్నాడు. కానీ ప్యామిలీ వీక్ తర్వాత నుంచి అమర్ దీప్ గేమ్ లో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం ఆయనను ఇష్టపడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. టాప్ 5లోనే ఉండడు అనుకున్న అతడు ప్రస్తుతం... టైటిల్ రేస్ లోకి వచ్చేశాడు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X