శ్రీముఖిపై చేతులు వేసిన ఆ ఆరుగురు, స్టేజ్‌పైనే.. భర్తను రేయ్ అంటూ .. సీరియల్ నటి ఆగ్రహం
విఘ్నాలకు అధిపతిగా , గణాలకు అధినేతగా ప్రథమ పూజలందుకుంటున్నాడు వినాయకుడు. సిరులకు సంపదలకూ, విజయాలకు ఆయనే ప్రధానం. గణపయ్యను ధ్యానం చేయకుండా ఏ దేవుడిని కొలిచినా ప్రయోజనం ఉండదు. మరోసారి వరసిద్ధి వినాయకుడు తొమ్మది రోజుల పాటు పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. దేశవ్యాప్తంగా ఉత్సవాలు అంగరంభ వైభవంగా నిర్వహించుకునేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. చలువు పందిళ్లు, భారీ సెట్టింగ్స్‌తో మండపాలను ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది విగ్రహాలు మండపాలకు తరలివెళ్తున్నాయి.
వినాయక చవితిని పురస్కరించుకుని అనేక ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులు వినోదాన్ని ఆస్వాదించే బుల్లితెరపై పలు ఛానెల్స్ స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేశాయి. తెలుగు విషయానికి వస్తే .. రియాలిటీ షోలు, సినిమాలు, స్పెషల్ కార్యక్రమాలతో దూసుకెళ్తున్న మాటీవీ .. ఈ వినాయక చవితికి కూడా స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది. గణపతి బప్పా మోరియా అనే పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను టెలికాస్ట్ చేయనుంది మా టీవీ. స్టార్ యాంకర్ శ్రీముఖితో పాటు బుల్లితెర నటీనటులు తమ కుటుంబాలతో సహా ఈ షోలో పార్టిసిపేట్ చేశారు.

ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. పండుగ కావడంతో నటీనటులంతా సాంప్రదాయ వస్త్రధారణలో కలర్‌ఫుల్‌గా రెడీ అయ్యారు. శ్రీముఖి చాలా ఈజ్‌తో ఈ షోను హోస్ట్ చేశారు. ఇలాంటివి చేయడంలో తనకు తిరుగులేదని శ్రీముఖి ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రోమో విషయానికి వస్తే.. రెండు టీమ్‌ల మధ్య పోటీ ఉంటేనే ఎంటర్‌టైన్‌మెంట్ ఓ రేంజ్‌లో ఉంటుందని.. అలాంటిది ఈసారి ఒక్క టీమ్ కాదు, రెండు కాదు ఆరు టీమ్‌ల మధ్య పోటీ ఉండబోతోందని శ్రీముఖి చెబుతుంది.
తలా ఓ చేయ్యేస్తే ఈసారి వినాయక చవితి అద్భుతంగా జరుపుకోవచ్చని శ్రీముఖి అనగానే.. మేల్ కంటెస్టెంట్స్ అంతా ఆమెపై చేతులు వేయగానే ఆమె తెల్లబోతుంది. ఆపై తేరుకుని తలో చెయ్యి వేయమన్నది నా మీద కాదని క్లారిటీ ఇవ్వగా అంతా పడి పడి నవ్వుతారు. హీరోలు గెలుస్తారా అని.. శ్రీముఖి మేల్ కంటెస్టెంట్స్‌ని ప్రశ్నిస్తుంది. కథలో ఎన్ని క్యారెక్టర్లు వచ్చినా ఫైనల్‌గా గెలిచేది హీరోనే అంటూ అర్జున్ అంబటి చెప్పిన పంచ్ డైలాగ్ కేకలు పెట్టించింది.
అన్నింటిలోకి బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అమర్‌దీప్ చౌదరి అతని భార్య తేజస్విని గౌడ మధ్య వచ్చిన సీన్ అదిరిపోయింది. రేయ్ అమర్ .. పులితో వేట, ఈ పెళ్లాంతో ఆట అంత ఈజీ కాదురోయ్ అని తొడగొట్టి సవాల్ చేస్తుంది తేజస్విని.. ఈ మాటలకు నన్ను రేయ్ అంటావా అన్నట్లుగా అమర్ షాకై చూస్తుంటాడు. మరి దానికి అతను ఎలాంటి రిప్లయ్ ఇచ్చాడు. ఈవెంట్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే వినాయక చవితి వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











