twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముదిరిన 'బిగ్ బాస్ 3' వివాదం.. ఇదీ హైకోర్టు రియాక్షన్

    |

    Recommended Video

    Bigg Boss Telugu 3 : Telangana High Court Reacts On Bigg Boss Telugu 3 Issue || Filmibeat Telugu

    బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' వివాదం సంచలనాలకు దారి తీసింది. గత రెండు సీజన్లపై కొన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పటికీ మూడో సీజన్ విషయానికొస్తే వివాదాల సుడిగుండాలు చుట్టుకున్నాయి. షో ప్రారంభానికి ముందు నుంచే బిగ్ బాస్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు అన్యాయం జరిగిందని, బిగ్ బాస్ పేరిట బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నారని, అమ్మాయిలను మోసం చేస్తున్నారని శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వాళ్ళు పోలీస్ కేసుల వరకూ వెళ్లారు. ఆ తర్వాత కోర్టుకు కూడా ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు. కాగా తాజాగా ఈ ఇష్యుపై హైకోర్టు రియాక్ట్ అయింది. వివరాల్లోకి పోతే..

    వివాదంలో బిగ్ బాస్ 3.. శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు

    వివాదంలో బిగ్ బాస్ 3.. శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు

    బిగ్ బాస్ నిర్వాహకులు అవకాశం పేరిట అమ్మాయిలకు వల వేస్తున్నారని శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తాలు బహిరంగ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వాళ్ళు బంజారా హిల్స్‌, రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్స్‌లో కేసులు నమోదు చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగక, తమకు న్యాయం చేయాలంటూ వారు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది.

    బిగ్ బాస్ నిర్వాహకుల క్వాష్‌ పిటిష‌న్

    బిగ్ బాస్ నిర్వాహకుల క్వాష్‌ పిటిష‌న్

    మరోవైపు శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా సహా ఇంకొంతమంది తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బిగ్ బాస్ నిర్వాహకులు అదే హైకోర్టులో క్వాష్‌ పిటిష‌న్ దాఖలు చేశారు. దీంతో ఇరు వర్గాల వాదనలను పరిశీలనలో పెట్టిన హైకోర్టు నిన్న (బుధవారం) బిగ్ బాస్ నిర్వాహకులకు కాస్త ఊరటనిచ్చింది.

    పోలీసుల‌కు ఆదేశాలు జారీ

    పోలీసుల‌కు ఆదేశాలు జారీ

    బిగ్ బాస్ వివాదం విషయమై విచార‌ణ చేప‌ట్టిన తెలంగాణ హై కోర్టు నిర్వాహ‌కుల‌పై న‌మోదైన కేసుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాలంటూ పోలీసులు, పిటిష‌న‌ర్‌ను ఆదేశించింది. ఈ నెల 24న త‌దుప‌రి విచార‌ణ చేపట్టనున్నామని, త‌దుప‌రి విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేయ‌రాదంటూ పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.

    బ్యాన్ చేయాలంటూ మిన్నంటుతున్న ఆదోళనలు

    బ్యాన్ చేయాలంటూ మిన్నంటుతున్న ఆదోళనలు

    ఆడవాళ్లను కించపరిచే విధంగా ఉన్న ‘బిగ్ బాస్' షోను వెంటనే రద్దు చేయాలని, నాగార్జున కూడా వెంటనే ఈ షో నుంచి తప్పుకోవాలని ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నాగార్జున ఇంటి ముందు ధర్నాకు దిగారు. పోలీసుల జోక్యంతో విద్యార్థులు వెనుదిరిగారు. ఈ పరిస్థితుల నడుమ జులై 21న బిగ్ బాస్ సీజన్ 3 ఎలా స్టార్ట్ అవుతోందో చూడాలి మరి.

    English summary
    Bigg Boss - Season 3 will starts on july 21st. On this show some Controvesy is running. Anchor Swetha Reddy and Gayathri Gupta says sensetional issues on Bigg Boss - Season 3 management.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X