twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెలి ఫిలింగా మాజీ ప్రధాని పీవీ ‘గొల్ల రామవ్వ’.. వెబ్‌సిరీస్‌గా తెలంగాణ కథలు!

    |

    తెలుగు జాతి చరిత్ర, ఘన కీర్తిని మరోసారి గుర్తు చేసేలా.. భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా బుల్లితెరపై తెలంగాణ కథలను ఆవిష్కరించిన తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరుగున పడిపోతున్న చరిత్రకు డిజిటల్ సొబగులు అద్ది తెలంగాణ కథలు అనే వెబ్ సిరీస్‌ను ప్రముఖ టెలివిజన్ న్యూస్ ఛానెల్ వీ6 రూపొందించింది. సుదీర్ఘ ఉద్యమం తర్వాత, తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించి, అభివృద్ధి పథంలో పురోగమిస్తున్న ఈ సమయంలో...తెలంగాణా సాహిత్య పరిమళాలను... డిజిటల్ చేసే ప్రయత్నానికి మంచి స్పందన వ్యక్తమవుతున్నది.

    మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు రచించిన 'గొల్ల రామవ్వ', చెరబండ రాజు రచన 'చిరంజీవి', కేవీ నరేందర్ రచన 'దొర మల్లా వచ్చిండు', ప్రముఖ రచయిత జాత శ్రీ రచించిన 'అంతర్ముఖం', జూకంటి జగన్నాథం రచించిన 'కళేబరం', తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచించిన 'ఇల్లు', ఎల్లాప్రగడ సీతాకుమారి రచన 'ఈ రాధేనా?', జింబో రచన 'సర్వేజనా సుఖినోభవంతు' సాహిత్యాన్ని మొదటి ప్రయత్నంగా వెబ్ సిరీస్‌గా మలిచారు. ఈ ఎనిమిది సాహితీ ముత్యాలను వెబ్ సిరీస్‌గా మలచడం వెనుక దర్శకుడు బండి రఘురాం విశేష పరిశోధన, కృషి దాగి ఉన్నది. ఈ వెబ్ సిరీస్‌లో టీఎన్నాఆర్, టెలివిజన్ సీరియల్స్ నిర్మాత కామిని శివకుమార్ తదితర రంగస్థల, సినీ నటులు నటించారు.

     Telangana Kathalu web series: P V Narasimha Raos Golla Ramavva as tele film

    లాక్‌డౌన్ సమయంలో వీ6 ఛానెల్ వెబ్ సిరీస్‌లోని ఎనిమిది ఎపిసోడ్స్‌ను మే నుంచి జూలై మధ్యన ప్రతీ ఆదివారం ప్రసారం చేయగా వాటికి అనూహ్యమైన స్పందన లభించింది. సాహిత్య, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో నిజాం నిరంకుశ సంకెళ్లను తెంచుకొని వయసును కూడా లెక్కచేయని అవ్వ 'గొల్ల రామవ్వ' తెగువను, అలాగే నక్సల్ ఉద్యమంలో పల్లెల్ని వదిలేసి.. పట్నాలకు పారిపోయిన దొరల తీరు.. అలాగే అలాంటి దొరలే రాజకీయ నాయకుల ముసుగులో గ్రామాల్లో ప్రవేశించి చేసిన అక్రమాలపై కళ్లకు కట్టిన చూపిన దొర మల్లా వచ్చిండు లాంటి కథలను వెబ్ సీరిస్‌గా మలిచిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఎనిమిది కథలు కూడా ప్రస్తుతం వీ6 యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్లలో అందుబాటులో ఉన్నాయి.

     Telangana Kathalu web series: P V Narasimha Raos Golla Ramavva as tele film

    తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి గాంచిన ఈ కథా వస్తువులను బుల్లితెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నాన్ని బండి రఘురాం 2014 నుంచి 2015 వరకు చేపట్టారు. సినిమా రంగంలో దర్శకత్వ శాఖలో విశేష అనుభవం, సాహిత్య రంగంపై రఘురాం ఉన్న పట్టు ఈ విష్కరణకు సాధ్యమయ్యేలా చేసింది.

     Telangana Kathalu web series: P V Narasimha Raos Golla Ramavva as tele film

    తెలంగాణ సాహిత్యం, చరిత్ర, సంస్కృతిని 25 నుంచి 50 ఎపిసోడ్స్ వరకు చేయాలని ప్లాన్ చేశారు. కానీ బడ్డెట్ పరిమితుల కారణంగా తొలి ప్రయత్నంలో 8 ఎపిసోడ్స్ మాత్రమే చిత్రీకరించామని దర్శకుడు రఘురాం చెప్పారు. మరుగున పడిన తెలంగాణ సాహిత్యాన్ని బుల్లితెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని త్వరలోనే చేపట్టాలని అనుకొంటున్నాం అని అన్నారు.

    బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు రచనలను, ఇతర ప్రసిద్ధ రచయితల సాహిత్యానికి బుల్లితెర రూపం కల్పించాలని భావిస్తున్నాం. వీలైతే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోని అద్భుతమైన సాహిత్యాన్ని, సంస్కృతిని భారీ వెబ్ సీరీస్‌గా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని బండి రఘురాం పేర్కొన్నారు.

    English summary
    "Telangana Kathalu" is a series of short films, produced by V6 News Channel - a prominent telugu TV channel that has represented the Telangana voice from well before the Telangana State was formed. 8 short films, based on previously published, critically acclaimed stories by respected authors from the Telangana region. The entire series was curated and directed by Raghu Ram Bandi, a film technician with good command over literature as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X