Mahesh in EMK : పూనకాలు లోడింగ్ ఎపిసోడ్ ఆరోజునే... గట్టిగానే ప్లాన్ చేసిన జెమినీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన నటన, కిల్లర్ లుక్స్ తో సెపరేట్ క్రేజ్ సంపాదించారు. జూనియర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటేశ్వరులు' షోలో మహేష్ బాబు పాల్గొన్నారు అని అందరికీ తెలుసు. అయితే ఆ ఎపిసోడ్ ఏ రోజు టెలికాస్ట్ కానుంది అనే విషయం మీద తాజగా ప్రకటన వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

స్పెషల్ గెస్ట్‌గా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాల్టీ షో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ షోలో సామాన్య ప్రజలే స్టార్ హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఈ షోలో సందడి చేశారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు స్పెషల్ గెస్ట్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే.

చెప్పనక్కర్లేదు
ఎవరు మీలో కోటీశ్వరులు షోలో హాట్ సీట్‌లో ఎన్టీఆర్ ఉంటే అదో రకమైన ఊపు వచ్చేస్తుంది. అటు అభిమానులు మాత్రమే కాక సినిమా లవర్స్ కూడా ఎన్టీఆర్ సిగ్నేచర్ హోస్టింగ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉంటే హోస్ట్ సీటు మ్యాజిక్ చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు కలిసి బుల్లితెర మీద గేమ్ ఆడితో ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము కదూ.

ఎలా ఉఁటుందో?
ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఎన్టీఆర్‌తో కలిసి మహేష్ బాబు ఆడుతూ ఉంటె ఆ గేమ్ ఇంకా ఎలా ఉఁటుందో? ప్రత్యేకంగా చెప్పగలమా? ఈ ఇద్దరూ ఆడుతూ గేమ్ ఎన్నెన్నో విషయాలు, అనుభూతులను పంచుకొన్నారట. ఆ విషయాలు ప్రేక్షకులకు మరింత థ్రిల్లింగ్‌గా మారుతాయని భావిస్తున్నారు. ఈ ఇద్దరి స్పెషల్ ఎపిసోడ్ చూసి ఇద్దరు హీరోల అభిమానులు ఆనందంలో మునిగిపోవడం ఖాయం అని చెబుతున్నారు.

మహేష్ బాబు విత్ పవన్
అయితే ఈ షోలో మహేష్ బాబు ఓ ప్రశ్నకు తడబడటంతో వీడియో కాల్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడం ద్వారా పవన్ కల్యాణ్ గేమ్‌లోకి వచ్చారు అని కూడా ప్రచారం జరిగింది. అయితే దాని మీద సరైన క్లారిటీ లేదనుకోండి. ఇక ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్, మహేష్ బాబు పాల్గొన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం గురించిన వివరాలు ఎట్టకేలకు వెల్లడైంది.

ఎప్పుడు టెలికాస్ట్ అంటే?
ఈ ఎపిసోడ్ ను డిసెంబర్ 5వ తేదీన అంటే ఈ ఆదివారం రాత్రి 8:30కు టెలీకాస్ట్ చేయనున్నారు. దీంతో ఈ షో గురించిన అన్ని విషయాలు ఇప్పుడు ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు. ఇక ఈ ఇద్దరి సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే మహేష్ బాబు తన రాబోయే చిత్రం సర్కారు వారి పాట బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు.
Recommended Video

ఎన్టీఆర్ విషయానికి వస్తే
మరోవైపు, రాజమౌళి డైరెక్షన్ లో తన రాబోయే సినిమా RRR విడుదల కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎదురుచూస్తున్నాడు. ఈ RRR జనవరి 7, 2022న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్ తదితరులు ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











