బిగ్ బాస్2: కౌశల్‌పై గీత మాధురి టంగ్ స్లిప్.. మీరు చేస్తే సంసారం మేము చేస్తే అదా!

Recommended Video

Bigg Boss 2 Telugu 67 Day Highlights : Call Center Task Went With A Great Interest

బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య పోటీ మరో స్థాయికి చేరుకుంటోంది. అందరు టైటిల్ వేటలో తలమునకలై పాల్గొంటున్నారు. గతవారం వరకు కూడా పెద్దగా హైలైట్ కాకుండా అదృష్టం కొద్దీ ఎలిమినేషన్ నుంచి బయట పడుతున్న గణేష్ కూడా ఈ వారం చెలరేగిపోతున్నారు. తాజగా బిగ్ బాస్ హౌస్ లో టెలిఫోన్ టాస్క్ మొదలైన సంగతి తెలిసిందే. టెలిఫోన్ టాస్క్ వలన హౌస్ లో కొత్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

రెండు టీమ్స్

రెండు టీమ్స్

టెలిఫోన్ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులని రెండు టీమ్స్ గా విభజించారు.

కాల్ సెంటర్ ఉద్యోగుల టీం: కౌశల్, దీప్తి, సామ్రాట్, నూతన్, అమిత్, శ్యామల

పబ్లిక్ టీం : పూజ, తనీష్, రోల్ రైడ, సునైన, గీత, గణేష్

 ఇష్టం వచ్చినట్లు

ఇష్టం వచ్చినట్లు

పబ్లిక్ టీం పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి కాల్ సెంటర్ ఉద్యోగులకు ఫోన్ చేస్తారు. వారితో పబ్లిక్ టీం ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు. ఒక వేళ కాల్ సెంటర్ ఉద్యోగి ముందుగా కాల్ కట్ చేస్తే పబ్లిక్ టీం కు ఒక పాయింట్ వస్తుంది. అదే పబ్లిక్ టీం కట్ చేస్తే కాల్ సెంటర్ వారికి ఒక పాయింట్ వస్తుంది.

వ్యక్తిగత విషయాలు

వ్యక్తిగత విషయాలు

కాల్ సెంటర్ ఉద్యోగుల్ని రెచ్చగొట్టేందుకు పబ్లిక్ టీం వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు. వ్యక్తిగత విషయాలు కూడా ప్రస్తావించవచ్చు. టాస్క్ పూర్తయ్యాక మరోమారు కాల్ సెంటర్ ఉద్యోగులు పబ్లిక్ టీంగా, పబ్లిక్ టీం కాల్ సెంటర్ ఉద్యోగులుగా మారుతారు.

కౌశల్ టార్గెట్

కౌశల్ టార్గెట్

పబ్లిక్ టీం ఎక్కువగా కౌశల్ నే టార్గెట్ చేసింది. గీత, సునైన, గణేష్ ఎక్కువగా కౌశల్ తో మాట్లాడి అతడిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ కౌశల్ విజయవంతంగా టాస్క్ పూర్తి చేశాడు.

ఒక పద్ధతి ప్రకారం

ఒక పద్ధతి ప్రకారం

గీత మాధురి కౌశల్ తో మాట్లాడుతూ ఒక పద్ధతి ప్రకారం అతడి వివాదాలని ప్రస్తావించింది. చివరకు గీత మాధురి ముందుగా కాల్ కట్ చేసింది. సునైనా, కౌశల్ మధ్య సంభాషణలో వ్యక్తిగత విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమయంలో సునైనా కన్నీరు పెట్టుకుంది.

సునైనా మ్యాటర్

సునైనా మ్యాటర్

టాస్క్ పూర్తైన తరువాత కాల్ సెంటర్ టీం పబ్లిక్ టీంగా, పబ్లిక్ టీం కాల్ సెంటర్ టీం గా మారారు. కాల్ సెంటర్ ఉద్యోగిగా మారిన తనీష్ కు కౌశల్ ఫోన్ చేశాడు. ఈ సమయంలో కౌశల్ మాట్లాడుతూ నీకు, సునైనాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అడగడం విశేషం.

గీతా మాధురి

గీతా మాధురి

నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కూడా కాల్ సెంటర్ టాస్క్ కొనసాగబోతోంది. దానికి సంబందించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో చూపిన దానిప్రకారం కౌశల్, గీత మధ్య వివాదం శృతి మించినట్లు కనిపిస్తోంది.

మీరు చేస్తే సంసారం

మీరు చేస్తే సంసారం

రోల్ రైడ.. సామ్రాట్ కు ఫోన్ చేసి తాను ఫోన్ పెట్టేస్తున్నా అంటూ అబద్దం చెప్పాడు. ఈ విషయంలో గీత మాధురి, కౌశల్ మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. మీరు చేస్తే సంసారం మేము చేస్తే ఇంకొకటా అంటూ కౌశల్ పై గీత నోరుజారింది. నేడు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X