ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్యాయత్నం.. భార్యతో గొడవలు.. చేతి మణికట్టు కట్ చేసుకొని..
మలయాళ వినోదరంగంలో ప్రముఖ టెలివిజన్ నటుడు ఆదిత్యన్ జయన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదిత్యన్ చర్యలతో సినీ ప్రముఖులంతా తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు. మృత్యువుతో పోరాడుతున్న ఆదిత్యన్‌ను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆదిత్యన్ ఆత్మహత్యయత్నం వెనుక అసలు కారణమేమిటంటే...

కారులోనే ఆత్మహత్యాయత్నం
మాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. ఆదిత్యన్ జయన్ ఏప్రిల్ 25 సాయంత్రం త్రిచూర్‌లో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తన కారులో కూర్చొని చేతి నరాలను కట్ చేసుకొన్నాడు. తీవ్రంగా రక్తస్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో త్రిచూర్ ప్రభుత్వం హస్పిటల్‌కు తరలించారు.

భారీగా నిద్రమాత్రలు మింగి సూసైడ్‌కు..
ఆదిత్యన్ జయన్ ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూసైడ్‌కు పాల్పడటానికి ముందు భారీ మొతాదులో నిద్రమాత్రలు మింగారు. ఆ తర్వాత చేతి నరాలు కట్ చేసుకొన్నాడు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆదిత్యన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని మీడియా కథనాలు వెల్లడించాయి.

24 గంటలు గడిస్తే తప్పా...
ఆదిత్యన్ జయన్ ఆరోగ్యంపై హాస్పిటల్ వర్గాలు వివరాలు వెల్లడిస్తూ.. అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకొన్నాడు. ప్రస్తుతం కడుపులో ఉన్న మాత్రలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. చేతికి బలమైన గాయమైంది. దానికి సర్జరీ చేసి కట్టుకట్టాం. నిద్రమత్తులో ఉండటం వల్ల చికిత్సకు స్పందించడం లేదు. 24 గంటల ఆగితే తప్ప అతడి కండిషన్ గురించి చెప్పలేం అని వైద్యులు వెల్లడించారు.

ఆదిత్యన్ జయన్‌పై భార్య ఆరోపణలు
రెండు రోజుల క్రితం మలయాళ నటి అంబిలి దేవి తన భర్త ఆదిత్యన్ జయన్‌పై వివాదాస్పద ఆరోపణలు చేసింది. తన రెండో భర్త తనను చీట్ చేశాడని ఆరోపించారు. చంపేస్తానని నా భర్త నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయిని అంబిలి దేవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే భార్య అంబిలి దేవి చేసిన ఆరోపణలను ఆదిత్య జయన్ ఖండించారు. వ్యక్తిగత విభేదాలను దృష్టిలో పెట్టుకొని తన ప్రతిష్టను దిగజార్చ వద్దని ఆయన సూచించారు. ఇలా భార్యతో గొడవ జరుగుతున్న సమయంలోనే ఆదిత్య జయన్ ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది.
Recommended Video

ఆదిత్యన్, అంబిలి ప్రేమ వివాహం అలా..
మలయాళ టెలివిజన్‌లో ప్రేక్షకాదరణ పొందిన సీతా సీరియల్‌లో అంబిలి దేవి, ఆదిత్యన్ జయన్ దంపతులుగా నటించారు. ఆ సీరియల్‌లో నటిస్తుండగా వారిద్దరు ప్రేమలో పడ్డారు. 2019లో వారిద్దరి పెళ్లి చేసుకొన్నారు. వారికి అర్జున్ అనే కుమారుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఆదిత్యన్ ఏంటే మాతవు, సీతా కల్యాణం సీరియల్‌లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











