సాయి ధరమ్ తేజ్‌కు విపరీతమైన గర్ల్స్ ఫాలోయింగ్.. గుట్టు విప్పిన సీరియల్ నటుడు

బుల్లితెర ప్రేక్షకుల్లో సీరియల్ నటుడు భరణి శంకర్ మంచి గుర్తింపు దక్కింకున్నారు. 2 దశాబ్దాలకు పైగా టెలివిజన్ రంగంతోపాటు సినీ పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. 2003 నుంచి భరణి శంకర్ బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. టీవీ రంగంలో బ్లాక్ బాస్టర్ సీరియల్స్‌తో పాటు వెండితెరపై బ్లాక్ బాస్టర్ సినిమాల్లో కీలక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు ఇటు టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ లోనూ నటిస్తున్నారు.

తెలుగు టెలివిజన్ రంగంలో ప్రసారమైన కామెడీ, రొమాంటిక్ సిరీయల్స్ లో యాంటీ హీరో పాత్రలు పోషించారు. విలన్ గా ఒకప్పుడు బుల్లితెర సంచలనం సృష్టించారు. ఆయన కెరీర్ లో 30పైకి సీరియల్స్ లో నటించి మెప్పించారు. సీరియల్ రంగంలో అగ్ర నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన నటించిన సీరియల్స్ సీతామహాలక్ష్మి, తరంగాలు, కుంకుమ రేఖ, పున్నాగ వంటి సిరీయల్స్ తో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈయన ఇప్పుడు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Television Actor Bharani Interesting Comments

నటుడు భరణి శంకర్ మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తున్నానని మా అమ్మకు చెప్పాను. ఆ షో పేరు చెప్పగానే సరే అని చెప్పింది. ఇక అమ్మ కూడా అప్పుడప్పుడు బిగ్ బాస్ షో చూస్తుంది. ఇప్పుడు నేను వెళ్లాక ఇక రోజూ చూడాల్సి వస్తుంది. మా అమ్మ నేను నటించిన ప్రతి సీరియల్, ప్రతి సినిమాను సీన్ టు సీన్ చూస్తుంది. తనకు నచ్చితే నచ్చిందని, లేకపోతే లేదని చెబుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో నాకు బెస్ట్ మూమెంట్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసిన రోజు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డెబ్యూ ఫిల్మ్ ముకుంద ఈవెంట్ కు నేను కూడా వెళ్లాను.

ఇక నాకు సాయి ధరమ్ తేజ్ మంచి స్నేహితుడు. స్నేహితుడు కంటే తమ్ముడిగా అనిపిస్తుంది. ఒక్క కడుపులో పుట్టిన వారిలా ఉంటాం. చాలా సరదాగా ఉంటాం. ఎన్నో విషయాలను మాట్లాడుకుంటూ ఉంటాయి. నాకు తెలిసి తేజూ ఎంతో మంచి వ్యక్తిత్వం గల వారు మరొకరు ఉండరని నా అభిప్రాయం. ఆయన ఎంతో మర్యాదగా మెదులుతారు. ప్రతి ఒక్కరిని మనిషిగా గౌరవిస్తారు. ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. నాకు తేజూ అంటే ఎంతో ఇష్టం.

ఇద్దరు కలిసి జిమ్ కు వెళ్తాం. ఇక తేజూకు అమ్మాయిల ఫాలోయింగ్ గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే తేజూ చూడటానికి కూడా హ్యాండ్సమ్ గా ఉంటారు. మంచి ఫిజిక్, లుక్ కలిగి ఉంటాడు. అంతే కంటే ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వానికి ఎవరైనా కరిగి పోవాల్సిందే. కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నాం. కానీ ఎప్పుడూ అమ్మాయిల గురించి మాత్రం తేజూ దగ్గర మాట్లాడను. నేను దేవుడిని గట్టిగా కోరుకునేది తేజూకు భారీ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే సక్సెస్ అందుకున్నారు. ఇంకా సరైన సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను. ఇక నేను మెగా స్టార్ విశ్వంభర చిత్రంలో నటించాను.. అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X