టెలివిజన్ నటుడు చందు వాట్సాప్ చాట్‌లో సంచలనాలు.. ఆత్మహత్యకు ముందు షాకింగ్ మెసేజెస్!

త్రినయిని సీరియల్ ఫేమ్ చందు చల్లా అలియాస్ చంద్రకాంత్ సూసైడ్ తెలుగు వినోద పరిశ్రమలో సంచలనం రేపుతున్నది. ఆరేళ్లుగా వివాహేతర బంధం కొనసాగుతున్న తన భార్య పవిత్రా జయరాం మరణించిన కొద్ది రోజులకే తన నివాసంలో ఉరి వేసుకొని మరణించడంతో టెలివిజన్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతికి గురి అవుతున్నది. ఆయన ఇకలేరనే విషయాన్ని తలుచుకొని స్నేహితులు, సన్నిహితులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. అయితే మరణానికి ముందు తన వాట్సాప్ ఛాట్‌లో వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. ఆ వార్తల వివరాల్లోకి వెళితే..

తన భార్య, త్రినయిని ఫేమ్ పవిత్ర జయరాం మరణించినప్పటి నుంచి పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. తన కళ్లముందే ఆమె మరణించడం జీర్ణించుకోలేకపోయాడు. తన స్నేహితులతో తన బాధను చెప్పుకొంటూ భోరున ఏడ్చాడు. పవిత్ర లేని జీవితం నాకు వద్దు.. నేను చనిపోతానని చెప్పాడు అని స్నేహితులు, సన్నిహితులు ఈ సందర్భంగా వెల్లడిస్తున్నారు.

Television Actor Chandu Challa WhatsApp Chat

ఇక తన స్నేహితులతో చేసిన వాట్సాప్ ఛాటింగ్‌లో నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను. ఈ జన్మకు ఇదే సరిపోతుంది అని వాట్సాప్ ద్వారా తెలియజేసినట్టు తెలుస్తున్నది. పవిత్ర లేని జీవితాన్ని కొనసాగించడం కంటే.. నేను వెళ్లిపోతేనే కరెక్ట్. లేదా నేను పిచ్చోడిని అయిపోయి.. లేదా తాగుబోతును అయిపోతాను. ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదు అని అని వాట్సాప్ ఛాట్ ద్వారా వెల్లడించినట్టు తెలిసింది.

చందు పంపిన ఆ వాట్సాప్ చాట్‌ను తన ప్రాణ స్నేహితులు మీడియాకు, పోలీసులకు షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన వాట్సాప్ ఛాట్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. అయితే తాము ఎంత నచ్చ చెప్పి ఆయనను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. కానీ ఆయన దారుణమైన నిర్ణయాన్ని తీసుకొన్నారు అని స్నేహితులు తెలిపారు.

ఇదిలా ఉండగా, శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొన్న చందు పార్ధీవ దేహాన్ని పోలీసులు స్వాధినం చేసుకొన్నారు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X