బాంబు పేలుళ్ల వెనక టీవీ నటి కుట్ర... అరెస్ట్ చేసిన పోలీసులు!

అస్సాం పోలీసులు టెలివిజన్ నటి జాహ్నవి సైకియాను గురువారం అరెస్ట్ చేశారు. గౌహతిలోని జూ రోడ్డులో బుధవారం జరిగిన గ్రేనేడ్ బాంబు దాడికి సంబంధించి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరొకరితో కలిసి ఆమె ఈ పేలుళ్లకు కుట్రచేసినట్లు తెలుస్తోంది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఈ ఘటనలో జాహ్నవి సైరియాతో పాటు ఉల్ఫా(యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం) తీవ్రవాద సంస్థలో సీనియర్ సభ్యుడు ప్రణమోయ్ రాజ్‌గురును పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు కేసును చేధించి ఈ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ బాంబ్ బ్లాస్ట్‌లో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

జాహ్నవి సైకియా

జాహ్నవి సైకియా

40 ఏళ్ల వయసున్న జాహ్నవి సైకియా స్థానిక భాషలో ప్రసారం అయ్యే పలు టీవీ సీరియల్స్‌‌లో నటించింది. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఉల్ఫా తీవ్రవాదం వైపు ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. పోలీసు విచారణలో జాహ్నవి సైకియా ఈ పేలుళ్ల గురించి ఒప్పుకున్నట్లు సమాచారం.

మెరుపుదాడి చేసిన పోలీసులు

మెరుపుదాడి చేసిన పోలీసులు

పేలుళ్లకు కారణమైన వారు పంజాబరి ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు మెరుపుదాడి చేయగా జాహ్నవి సైకియా, ప్రణమోయ్ రాజ్‌గురు పట్టుబడ్డారు. వారి వద్ద బాంబు తయారీ మెషీన్‌తో పాటు తుపాకులు, గన్ ఫౌడర్ స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో సంచలన విషయాలు

విచారణలో సంచలన విషయాలు

విచారణలో జాహ్నవి సైకియాతో పాటు ప్రణమోయ్ రాజ్‌గురు పలు సంచలన విషయాలు బయట పెట్టారు. తమ డిమాండ్లు తీర్చే వరకు బాంబు దాడులు కొనసాగుతూనే ఉంటాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి సేకరించిన సమాచారంతో అస్సాం పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.

టీవీ నటి హస్తం ఉందని తేలడంతో అంతా షాక్

టీవీ నటి హస్తం ఉందని తేలడంతో అంతా షాక్

తీవ్రవాద కార్యకలాపాల్లో ఒక టీవీ నటి హస్తం ఉందనే విషయం మీడియాలో చర్చనీయాంశం అయింది. పోలీసులు ఈ కేసును వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇంకా ఎవరికైనా నటులకు ఉల్ఫా సంస్థతో సంబంధాలు ఉన్నాయా? అనే అంశంపై ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X