twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెలివిజన్ నటుడు అరెస్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు

    |

    టెలివిజన్ నటుడు, కోయిలమ్మ ఫేమ్ అమర్‌‌ కటకటాల పాలయ్యాడు. కొద్ది రోజలు క్రితం హైదరాబాద్ మణికొండలోని ఓ షోరూమంలో జరిగిన గొడవలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో తెలుగు టెలివిజన్ రంగంలోని ప్రముఖులు షాక్ గురయ్యారు. అమర్ అరెస్ట్ కావడానికి కారణం ఏమిటంటే...

    బోటిక్‌ బిజినెస్‌లో విబేదాలతో

    బోటిక్‌ బిజినెస్‌లో విబేదాలతో

    రష్మీ, శ్రీవిద్య అనే ఇద్దరు యువతులు అమర్‌కు క్లోజ్ ఫ్రెండ్స్. వారిద్దరూ కలిసి బోటిక్‌ బిజినెస్‌ను ప్రారంభించారు. అయితే వారి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో బిజినెస్‌పరంగా విడిపోయారు. అయితే రష్మికి సంబంధించిన కొన్ని వస్తువులు అక్కడే ఉండటంతో వాటిని తీసుకోవడానికి వెళ్లారు.

    అమర్ జోక్యంతో వివాదంగా

    అమర్ జోక్యంతో వివాదంగా

    అయితే బోటిక్‌లో రష్మి, శ్రీవిద్యకు మధ్య గొడవ తీవ్రస్థాయిలో జరగడం అందులో అమర్ జోక్యం చేసుకోవడంతో గందరగోళం నెలకొన్నది. ఈ క్రమంలో అమర్, మరో ముగ్గురు తనపై దౌర్జన్యానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమర్‌తో ప్రాణహాని ఉందని ఆరోపించింది.

    ఆరోపణలనకు ఖండించిన అమర్

    ఆరోపణలనకు ఖండించిన అమర్

    అయితే తనపై వచ్చిన ఆరోపణలను అమర్ ఖండించారు. తప్పతాగి తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. కొందరు తనపై పనిగట్టుకొని ప్రచారం చేశారని అన్నారు. ఈ క్రమంలో అమర్‌పై ఐపీసీ సెక్షన్ 509, 506 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    రిమాండ్‌తో చర్లపల్లి జైలుకు

    రిమాండ్‌తో చర్లపల్లి జైలుకు

    గత రెండు వారాలుగా పోలీసులు దర్యాప్తు, విచారణ చేపట్టి అమర్‌ను అరెస్ట్ చేశారు. ఆయనను కూకట్‌పల్లి కోర్టులో రాయదుర్గం పోలీసులు హాజరుపరిచారు. దాంతో అమర్‌ను రిమాండ్‌కు తరలించాలని ఆదేశించంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

    English summary
    Television actor koilamma fame Amar Arrested and sent to Charlapalli Jail. As per media report, Amar sent Charlapally Jail in Manikonda boutique issue which took few week ago.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X