యాంకర్ సుమ కనకాల ఇంట్లో విషాదం.. నటి శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు..

నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకొన్నది. రాజీవ్ కనకాల సోదరి, టెలివిజన్ నటి శ్రీ లక్ష్మి కనకాల తిరిగిరాని లోకాలకు వెళ్లారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మరణించారు. ఆమె మృతివార్తతో టెలివిజన్ పరిశ్రమ తీవ్ర దిగ్రాంతికి గురైంది. ఆమె మరణం తీరని లోటు అని పలువురు తమ సంతాప ప్రకటనలో వెల్లడించారు. వివారాల్లోకి వెళితే..

Recommended Video

Anchor Suma Serious On Telugu Peope Behavior | చెప్పేది మీకే.. అర్దం కావట్లేదా..?
టెలివిజన్ రంగంలో

టెలివిజన్ రంగంలో

నటి శ్రీలక్ష్మి కనకాల పలు సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో నటిగా కొనసాగుతున్నారు. దూరదర్శన్‌లో ప్రసారమైన రాజశేఖర చరిత్రము అనే ధారావాహిక ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించి మెప్పించారు. దేవదాస్ కనకాల కూతురుగా బుల్లితెరపై తమ ముద్రను వదిలి వెళ్లారు.

దేవదాస్ కనకాల దంపతులకు

దేవదాస్ కనకాల దంపతులకు

ప్రముఖ రంగస్థల, సినీ నటుడు దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి దంపతులకు శ్రీలక్ష్మి జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది. 2002, మార్చి 31న తెలుగు నాటకరంగ ప్రముఖులు, కవి, తెలుగు కథా రచయిత, రంగస్థల అధ్యాపకులైన డా. పెద్ది రామారావుతో శ్రీలక్ష్మి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు (ప్రేరణ, రాగలీన). రాజీవ్, యాంకర్ సుమ అన్నావదినలనే విషయం తెలిసిందే.

నటిగా కెరీర్‌ ఇది

నటిగా కెరీర్‌ ఇది

దూరదర్శన్‌లో స్వయంవరం, జెమినీ టీవీలో చిన్నారి, కొత్త బంగారం, కలియుగ రామాయణం, అరుందతి, స్వాతి, ఆకాశగంగ, అగ్నిపూలు, నేను ఆయన నలుగురు అత్తలు, ఈటీవిలో ప్రియాంక, ఋతుధార నటించారు. కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఏప్రిల్ 6వ తేదీ సోమవారం మరణించారు.

చాలా విషాదకరమైన రోజు

చాలా విషాదకరమైన రోజు

నటి శ్రీలక్ష్మి మరణించారు. చాలా విషాదకరమైన రోజు. మా పాప స్వర్గస్తులయ్యారు. పాప అంటే రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి కనకాల. మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చిన్నప్పుడు మా చేతుల మీదుగా పెరిగారు. మేము అల్లారుముద్దుగా పెంచాం. అలాంటి వ్యక్తి మమల్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయారు. ఈ విషాయన్ని తెలియజేయడానికి చాలా బాధాకరంగా ఉంది అని కుటుంబ సన్నిహితులు ఓ వీడియోలో పేర్కొన్నారు.

దయచేసి ఎవరు రావొద్దు

దయచేసి ఎవరు రావొద్దు

ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలక్ష్మీ కనకాలకు ఉన్నోచోటు నుంచే శ్రద్దాంజలి ఘటించండి. ఎవరూ ఇంటికి రాకూడదు. ప్రభుత్వ, పోలీసుల అదేశాలు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. కరోనావైరస్ కారణంగా ఎక్కువ మంది గుమ్మి కూడదని, కలువ కూడదనే హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎవరూ కూడా అంతిమ చూపు గురించి రావొద్దు అని వీడియో ద్వారా వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X