‘పిలల్ని కనడం ఇష్టం లేదు.. అందుకే నా భర్తకు విడాకులు’
టెలివిజన్ ఇండస్ట్రీలో ఇద్దరు నటీనటుల విడాకుల వ్యవహారం అత్యంత చర్చనీయాంశమవుతున్నది. ఉత్తరాదిలో ప్రసారమవుతున్న లాక్ ఆప్ 2 రియాలిటీ షోలో ఈ వివాదం బయటపడటంతో సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీస్తున్నది. టెలివిజన్ రంగంలో మంచి పాపులారిటీ ఉన్న ఆకాంక్ష చమోలా, గౌరవ్ ఖన్నా విడాకుల వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది నెలలుగా రూమర్లుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వ్యవహారానికి అకాంక్ష అధికారికంగా వివరణ ఇవ్వడం, ఆమె చెప్పిన కారణాలు మరింత వైరల్ అయ్యాయి. ఆకాంక్ష తన భర్తతో విడాకుల విషయంలో ఏం చెప్పారంటే?
ఆకాంక్ష చామోల వ్యక్తిగత వివరాల్లోకి వెళితే.. హిందీ వినోద పరిశ్రమలో దిల్ దోఖా ఔర్ డిజైర్, భూతు, కైసే ముజే మిల్ గయీ చిత్రాల ద్వారా సుపరిచితులు. వర్ధమాన తారగా మంచి గుర్తింపు పొందుతున్నారు. టెలివిజన్ రంగంలో రాణిస్తున్న సమయంలోనే సహచర నటుడు గౌరవ్ ఖన్నాతో ప్రేమలో పడింది. రెండు కుటుంబాల అనుమతితో వారిద్దరూ 2016, నవంబర్ 24వ తేదీన వివాహం చేసుకొన్నారు.

అయితే గత 10 ఏళ్లుగా వారి దాంపత్య జీవితం సరిగానే సాగుతుందనే విషయం కనిపించింది. అయితే గత కొద్ది నెలలుగా వారిద్దరూ విడిపోతున్నారనే విషయం మీడియాలో పొక్కింది. అయితే ఆ వార్తలను ఇద్దరు అధికారికంగా ధృవీకరించలేదు. కానీ లాక్ అప్ 2 షోలో ఆకాంక్ష తన విడాకుల వ్యవహారం నిజమేనేనని చెప్పారు. దాంతో రూమర్లకు తెర దించడమే కాకుండా విడాకులకు కారణాన్ని కూడా వెల్లడించారు.
తమ విడాకుల వ్యవహారంపై ఆకాంక్ష మాట్లాడుతూ.. గతేడాది కాలంగా మేము విడిపోయాం. వేర్వేరుగా జీవితాలను గడుపుతున్నాం. మా మధ్య గొడవలు లేకుండానే మేము విడిపోయాం. మేము ఇప్పటికీ సఖ్యతతోనే మాట్లాడుకొంటాం. మా మధ్య అభిప్రాయాలు కలవడం లేదు. జీవిత భాగస్వాములుగా లైఫ్‌ను కొనసాగించలేమని నిర్ణారించుకొన్న తర్వాత మేము సపరేట్ అయ్యాం అని చెప్పారు.
మేము పెళ్లి చేసుకొనే సమయంలోనే నేను క్లారిటీగా కొన్ని విషయాలు మాట్లాడుకొన్నాం. అందులో సంతానం ఒకటి. నేను పిల్లల్ని కనే బాధ్యతను తీసుకోలేను. తల్లిగా నా బాధ్యతను నిర్వర్తించలేను. నాకు మాతృత్వంపై అయిష్టం ఉందనే విషయం మనసులో బలంగా నాటుకుపోయింది. కానీ నా భర్తకు పిల్లల్ని కనాలనే కోరిక బలంగా పెరిగింది. నాకు ఆ కోరిక లేనప్పుడు ఆ విషయంలో మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అందుకే విడాకులు తీసుకోవాలని అనుకొన్నాం అని లాక్ అప్ 2 తాజా ఎపిసోడ్‌లో క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications