‘నీతో లవ్ కాదు.. ఒకసారి అది కావాలి’.. సుడిగాలి సుధీర్ తో హీరోయిన్ రచ్చ
బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కామెడీ షోలో ఆర్టిస్ట్ గా, టీమ్ లీడర్ గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఓవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు తన కంటూ ప్రత్యేక శైలిని ప్రదర్శించారు. మంచి ప్రశంసలు అందుకున్నారు. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇక జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక ప్రస్తుతం ఆయా గేమ్ షోలకు యాంకర్ గా వ్యవహిరిస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సుడిగాలి సుధీర్ షోకు హాజరైన హీరోయిన్ షాకింగ్ గా ప్రవర్తించింది. సుధీర్ తో తన మాటతో షాక్ కు గురి చేసింది.
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ సంచలనం..
తెలుగు టెలివిజన్ రంగంలో ప్రస్తుతం ప్రేక్షకులకు కిక్కిచ్చే గేమ్ షోస్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో సర్కార్ : మీ పాటే నా ఆట అంటూ కొనసాగుతున్న షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ టీవీ షో ప్రసారం అవుతోంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. టెలివిజన్ సెన్సేషనల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు మూడు సీజన్లను హోస్ట్ చేశారు. 4వ సీజన్ నుంచి సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం 5వ సీజన్ కొనసాగుతోంది. కమెడియన్, యాంకర్, నటుడు సుడిగాలి సుధీర్ ప్రస్తుతం సర్కార్ 5వ సీజన్ ను హోస్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా 4వ ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కంప్లీట్ అయ్యింది. కాగా తాజాగా ఇంట్రెస్టింగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ గేమ్ షోతో పాటు మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్ వంటి షోలకు కూడా తనే హోస్ట్ గా ఉండటం విశేషం.
సర్కార్ సీజన్ 5లో మారన్ టీమ్..
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు సర్కార్ సీజన్ 5 ద్వారా బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నారు సుడిగాలి సుధీర్. కాగా తాజాగా ఈ రియాలిటీ గేమ్ షోకు కోలీవుడ్ లో రూపుదిద్దుకున్న 'మార్గన్' మూవీ టీమ్ గెస్ట్ గా హాజరైంది. తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ, అజయ్ దిశాన్, బ్రిడిగా సాగా, నటి దీప్షికా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ తో ఫన్ క్రియేట్ చేశారు. ఆంటోనీ, అజయ్ లు ఇద్దరూ సుడిగాలి సుధీర్ మాటలకు పంచులు వేస్తూ నవ్వులు పూయించారు. కాగా తమిళ సీరియల్ నటి దీప్షిక సుడిగాలి సుధీర్ తో ప్రవర్తించిన తీరు ఆశ్చర్యకరంగా మారింది.
సుడిగాలి సుధీర్ కు కన్ను కొట్టి మరీ..
సుడిగాలి సుధీర్ తో తమిళ నటి దీప్షికా చాలా ఆసక్తికరంగా మాట్లాడింది. సుడిగాలి సుధీర్ తన లవ్ లైఫ్ గురించి చెబుతుంటే.. ఆమె బోల్డ్ కామెంట్స్ చేసింది. 'నువ్వు లవ్ కు సెట్ కావు కానీ.. జస్ట్ మినిట్ దానికైతే' అని వ్యాఖ్యానిస్తూ సుడిగాలి సుధీర్ కు కన్నుకొట్టడం సర్కార్ 5 ఎపిసోడ్ 4 ప్రోమోలో హైలెట్ గా నిలిచింది. ఇక మార్గన్ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో టీమ్ గట్టిగానే ప్రమోట్ చేస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే సర్కారు 5 గేమ్ షోకు వచ్చారు.


Click it and Unblock the Notifications











