పానీపూరి మత్తులో లక్ష రూపాయలు మర్చిపోయిన నటి.. షాకింగ్ ట్విస్ట్!
ఇటీవల ఒక నటికి ఊహించని అనుభవం ఎదురయింది. పానీపూరి మత్తులో పడి దాదాపు లక్ష రూపాయలను పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో కొంత సేపటి వరకు హైటెన్షన్ నెలకొంది. ఘటనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అనేక రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. పానీ పూరి కోసం లక్ష రూపాయల మర్చిపోయిన ఆ నటి ఎవరు అని ప్రస్తుతం కొంత మంది నెటిజన్లు కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. ఇంతకు ఆమె ఎవరు ఎలా ఈ ఇన్సిడెంట్ జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

కామ్యా పంజాబీ
పలు హిందీ సీరియల్స్ తో మంచి గుర్తింపును అందుకున్న కామ్యా పంజాబీ సోషల్ మీడియాలో కూడా చాలా చలాకీగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు. ఎలాంటి టీవీ కంటెంట్ చేసినా కూడా ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది అని కూడా కామ్య మంచి గుర్తింపుని అందుకుంది. రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో కి ఎంట్రీ ఎవ్వగానే ఫాలోవర్స్ సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.

పానీపూరి వలన
అయితే రీసెంట్ గా కామ్యాకి ఒక ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె తన దగ్గర ఉన్న లక్ష రూపాయలు దాదాపు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కొన్ని నిమిషాల వరకు ఆమె ఆ విషయంలో చాలా ఆందోళన చెందింది. కేవలం పానీపూరి వలన లక్ష రూపాయలు చేజారిపోయేవి అని ఆమె విభిన్నంగా స్పందించడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో కూడా ఈ వార్త పై పలు రకాల కామెడీ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

మైమరచిపోయి..
కామ్యా ఇటీవల ఒక ఈవెంట్ కోసం మధ్యప్రదేశ్లోని ఇండోర్ కు బయలుదేరింది. అయితే అక్కడ ఒక ప్రదేశంలో పానీపూరి చాలా స్పెషల్ అని తెలుసుకుని ఆమె తనకు ఎంతో ఇష్టమైన పానీ పూరి తినేందుకు బయలుదేరింది. మొదట 2 పానీపూరీలు తిన్న తర్వాత వాటి టేస్ట్ బాగా నచ్చడంతో మైమరిచిపోయి మరిన్ని ఎక్కువగా లాగించేసింది. పక్కన ఎవరున్నారు తన దగ్గర ఏం వస్తువులు ఉన్నాయి అని కూడా చూడకుండా పానీపూరి బాగానే తినేసిందట.

మర్చిపోయినట్లు తెలియడంతో..
అయితే తన దగ్గర ఉన్న బ్యాగ్ లలో ఒక కవర్లో దాదాపు లక్ష రూపాయలు కూడా ఉన్నాయట ఇక పానీపూరి తినే సమయంలో వాటిని పక్కన పెట్టిన కామ్యా తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె హోటల్ కు తిరిగి వచ్చిన తర్వాత తన దగ్గర ఉండాల్సిన లక్ష రూపాయల కనిపించడం లేదు అని ఆశ్చర్యపోయింది. వెంటనే తన మేనేజర్ కు చెప్పడంతో ఆ పానీపూరి స్టాల్ దగ్గరకు వెళ్ళాడు.

చాలా మంచి వారు
ఇక కామ్యా పంజాబీ మేనేజర్ అక్కడికి వెళ్లి చూడడంతో లక్ష రూపాయల బ్యాంక్ అక్కడే ఉందట. ఈ విషయం పై వివరణ ఇచ్చిన కామ్యా ఎంతో రద్దీగా ఉండే ఆ ప్రదేశంలో కవర్ మర్చిపోయాను అంటూ దాదాపు అది దొరికి ఉండదు అని కూడా ఆమె అనుకుందట. మేనేజర్ ను వెళ్లి చూడమని అన్నప్పుడు అతను ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా ధైర్యం వచ్చింది అని నిజంగా అది దొరకగానే చాలా ఆశ్చర్యపోయాను అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇండోర్ ప్రజలు చాలా మంచివారు అని కూడా కామ్యా వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











