Divorce: భర్తకు టెలివిజన్ నటి విడాకులు.. రెండేళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై!

ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో దాంపత్య వైఫల్యాలు, సంసార పరంగా విడిపోవడం లాంటి ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అయితే కొన్ని రూమర్లుగాను, మరికొన్ని వాస్తవంగా మారి అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే తాజాగా మలయాళ టెలివిజన్ రంగంలో రాణిస్తున్న నటి తన భర్తకు విడాకులు ఇవ్వడం ఆమె ఆమె అభిమానులు, ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయితే విడాకులు తీసుకోవడం వెనుక సుదీర్ఘమైన లేఖను విడుదల చేసి తన ఫాలోవర్స్‌కు వివరణ ఇచ్చారు. ఇంతకు మలయాళ టెలివిజన్ నటి విడాకుల వెనుక కారణం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

వర్థమాన నటి హరితా జీ నాయర్ మలయాళ టెలివిజన్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ ఉన్న నటి. కస్తూరిమన్ అనే సీరియల్‌లో శ్రీ కుట్టిగా నటించి విశేషంగా ఆదరణను పొందారు. ఆ తర్వాత టెలివిజన్ రంగంలో రాణించి తనకంటూ ఇమేజ్ సొంతం చేసుకొన్నారు. స్నేహపూర్వమ్ శ్యామ అనే సీరియల్‌లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇంకా పలు కార్యక్రమాలతో బిజిగా ఉన్నారు.

Television Actress Haritha G Nair divorce

అయితే హరితా నాయర్ చాలాకాలం తన స్నేహితుడు, దృశ్యం 2 సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేసిన వినాయక్‌తో ప్రేమలో ఉన్నారు. వారిద్దరూ డేటింగ్‌ నుంచి బయటకు వచ్చి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. 2023 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. అయితే గత రెండేళ్లుగా వారి దాంపత్య జీవితం సవ్యంగా సాగుతున్నట్టు కనిపించింది. కానీ అనూహ్యంగా ఆమె విడాకుల వార్తను బయటకు చెప్పి అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది.

అయితే రెండేళ్ల దాంపత్య జీవితానికి ముగింపుకు కారణం వారి మధ్య వ్యక్తిగత అభిప్రాయలే అనే సన్నిహితులు చెబుతున్నారు. కొద్దికాలంగా హరిత, వినాయక్ మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి. వాటిని పరిష్కరించేందుకు వారి కుటుంబాలు, స్నేహితులు, సన్నిహితులు చొరవ తీసుకొన్నారు. కానీ అవి పరిష్కరించుకొనేంతగా లేకపోవడంతో విడిపోవడానికి కోర్టును ఆశ్రయించారు అని తెలిపారు.

తమ విడాకుల వార్తకు సంబంధించి హరిత ఇన్స్‌టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ఏడాదిన్నర కాలంగా మేమిద్దరం వేర్వేరుగా జీవిస్తున్నాం. నేను, వినాయక్ వీఎస్ ఇద్దరం ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అధికారికంగా విడిపోయాం. మా మధ్య ఉన్న స్నేహం ఇక హ్యాపీగా ముందుకు వెళ్తుంది. మేమిద్దరం తమ తమ రంగాల్లో బాగా రాణించాలని ఒకరికొకరం కోరుకొని విడిపోతున్నాం అని తెలిపారు.

మేము విడిపోవడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమైన కారణాలే. ఆ కారణాలు మా మధ్యలోనే ఎప్పటికీ ఉంటాయి. ఇలాంటి సమయంలో మాకు సపోర్టుగా నిలిచిన మా కుటుంబాలకు రుణపడి ఉంటాం. మా అభిప్రాయాలను గౌరవించినందుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండాలని మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ప్రయాణానికి ఎప్పటిలానే మీ సహకారం ఉంటుంది అని భావిస్తున్నాం అని తన పోస్టులో రిక్వెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X