టీవీ నటి ఇంట్లో ఏడుగురికి కరోనా.. నరకం చూస్తున్నా.. సోషల్ మీడియాలో ఆవేదన

దేశవ్యాప్తంగా సెలబ్రిటీల నుంచి సాధారణ పౌరులను ఎవరిని కదిలించినా కరోనా కష్టాలనే చెబుతున్నారు. కరోనావైరస్ బారిన పడిన కుటుంబాలు నరకాన్ని చూస్తున్నారు. సరైన అవగాహన లేక, ఉన్నా సదుపాయలు కరువై ఎన్నో బాధలకు గురవుతున్నారు. అలాంటి విపత్కర పరిస్థితే టీవి నటి మోహెనా కుమారికి ఎదురైంది. గత కొద్ది రోజులుగా తన ఫ్యామిలీలో కరోనా రేపిన కలకలంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. తన బాధలను సోషల్ మీడియాలో వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

ఇంటి సభ్యులందరికీ కరోనా

ఇంటి సభ్యులందరికీ కరోనా

నటి మోహెనా కుమారి ఇంట్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఇంట్లో అస్వస్థతకు గురైన కుటుంబ సభ్యుడికి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఇంటి సభ్యులందరికీ రోగ నిర్ధారణ పరీక్షలు జరిపించగా మరో ఆరుగురికి కూడా ఈ వ్యాధి సోకిందనే విషయం బయటపడింది. అప్పటి నుంచి మోహెనాకు పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ విషయం మీడియాలో రాగానే ఆమె బహిరంగా ప్రకటన చేసింది.

నా ఇంట్లో ఏడుగురికి కొవిడ్ 19

నా ఇంట్లో ఏడుగురికి కొవిడ్ 19

నా ఫ్యామిలీలో కరోనావైరస్ పాజిటివ్ అనే విషయంపై వస్తున్న వార్తలు నిజమే. మా ఇంట్లో మొత్తం ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో కుటుంబమంతా ఒక్కసారిగా షాక్ తిన్నది. ఆ వార్త తెలిసినప్పటి నుంచి నా ప్రాణం పోయినంత పనైంది. ఇలాంటి కష్టకాలంలో ఏం చేయాలో తోచడం లేదు. ఎటు చూసినా అంతా గందరగోళంగా కనిపిస్తున్నది. త్వరలోనే అంతా సర్ధుకుంటుందనే భావనాలో ఉన్నాం అని మోహెనా కుమారి ఆవేదన వ్యక్తం చేశారు.

స్పల్ప జ్వరమని తేలికగా తీసుకొన్నాం

స్పల్ప జ్వరమని తేలికగా తీసుకొన్నాం

మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి స్వల్ప జ్వరం వచ్చింది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా జ్వరం వచ్చిందని అనుకొన్నాం. అయితే ఎవరిలోను తీవ్రంగా జ్వరం, కోవిడ్ లక్షణాలు లేవు. దాంతో మేము చాలా తేలికగా తీసుకొన్నాం. తీరా రోగ నిర్ధారణ పరీక్షల తర్వాత వచ్చిన రిపోర్టులు చూసి షాక్ తిన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మేమంత హాస్పిటల్‌లోనే ఉన్నాం. తాజాగా మాలో ఒకరికి కరోనా నెగిటివ్ అని తేలడం కొంత ఉపశమనం కలిగింది అని మోహెనా తెలిపారు.

రాత్రిళ్లు నిద్రపట్టక నరకం

రాత్రిళ్లు నిద్రపట్టక నరకం

మా ఇంటి సభ్యులందరికీ కరోనా పాజిటివ్ అని తేలగానే నాకు నిద్ర పట్టడం లేదు. రాత్రిళ్లు అంతా ఏదో చెప్పలేని బాధ. రాత్రైతే ఓ నరకంగా ఉంది. ఒంటరితనంతో చాలా బాధపడుతున్నాను. ఎవరికైనా నా బాధను చెప్పుకోవాలంటే ఎవరు స్పందించని పరిస్థితి ఉంది. కానీ నా ఫ్రెండ్స్, సన్నిహితులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా, మొబైల్ ద్వారా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Recommended Video

Sirivennela - Jai Jai Ganesha Video Song
మోహెనా కెరీర్ గురించి

మోహెనా కెరీర్ గురించి

నటి మోహెనా కుమారి విషయానికి వస్తే.. టెలివిజన్ రంగంలో యువ, వర్థమాన తారగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్నారు. జాతీయ టెలివిజన్ ఛానెల్‌లో అత్యంత ప్రేక్షకాదారణ పొందిన యే రిస్తా క్యా కహ్లాతా హై అనే సిరియల్‌లో ఆమె పోషించిన కీర్తి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పలు సీరియల్స్, సినిమా ఆఫర్లు వస్తున్నాయనే విషయాన్ని ఆమె కొద్దికాలం క్రితం వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X