Bigg Boss Telugu 9: హౌజ్ లోకి బుల్లితెర సెన్సేషనల్ నటి.. ఇప్పటికే బిగ్ బాస్ లో రచ్చ

తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షోకు మంచి ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు టెలివిజన్ షోల్లో వచ్చిన అన్నింటి కంటే బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ఇప్పటి వరకు ఈ గేమ్ షో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కూడా ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా కంటెస్టెంట్ల ఎంపికపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈసారి హౌజ్ లో ఫైట్ చేసేందుకు ఎవరెవరు వస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే పలువురు బుల్లితెర స్టార్స్ పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా తెలుగు టెలివిజన్ రంగంలో హీరోయిన్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ భామ ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లుగా ఎంపికైంది వీరే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు ప్రారంభానికి ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్లను తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కొందరి బుల్లితెర స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. సుమంత్ అశ్విన్, జ్యోతి రాయ్, కల్పికా గణేష్, తేజస్విని గౌడ, అలేఖ్య సిస్టర్స్ లో ఒకరు, శ్రావణి శర్మ, ఆర్జే రాజ్, సాయి కిరణ్, ఈకనాథ్, దీపికా, దెబ్జానీ వంటి బుల్లితెర సెలబ్రెటీలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇంకా దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మరికొందరు సెలబ్రెటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బుల్లితెర సీరియల్ నటి నవ్య స్వామి కూడా ఎంపికైందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

Television Actress Navya Swamy Entry to Bigg Boss Telugu season 9

నవ్య స్వామి వివరాలు..
తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో నవ్య స్వామి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగు నటిగా కాదు. కర్ణాటకకు చెందింది. కర్ణాటకలోని మైసూర్ లో 1990 మార్చి 17న జన్మించింది. ప్రస్తుతం ఆమెకు 34 ఏళ్లు ఉంటాయి. బ్రహ్మాణ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఆమె మాతృ భాష కన్నడ అయినప్పటికీ తెలుగులోనూ అనర్గళంగా మాట్లాడగలదు. మైసూర్ లోనే రోటరీ వెస్ట్ స్కూల్ లో చదువుకుంది. ఆ తర్వాత ఎంఎంకే, ఎస్డీఎం విమెన్ కాలేజీలో చేరింది. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనెజ్ మెంట్ లో ఉత్తీర్ణత సాధించి పట్టా పొందింది.

నవ్య స్వామి సీరియల్స్, సినిమాలు..
నవ్య స్వామి తొలుత మోడల్ గా కెరీయర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా కన్నడ, తమిళం, తెలుగు టెలివిజన్ రంగంలో అవకాశాలు అందుకుంది. అలాగే చిత్ర పరిశ్రమలోనూ హీరోయిన్ గా ఆఫర్లు అందుకుంది. తంగలి, వాణి రాణి, నా పేరు మీనాక్షి, ఆమె కథ వంటి సీరియల్స్ లో నటించింది. ఇక సినిమాల్లో ఇంటింటి రామాయణం, బుట్ట బొమ్మ, రావనసుర వంటి తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం?
తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడు ప్రారంభం కానుందని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 7 సెప్టెంబర్ 2025 తేదీన షో గ్రాండ్ లాంచ్ కాబోతుంది. ఈసారి సెలబ్రెటీలతో పాటు ఇద్దరు సామాన్యులకు కూడా హౌజ్ లోకి ఆహ్వానం పలకడం విశేషం. మరోవైపు సీజన్ 9కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X