రెండో పెళ్లి చేసుకొన్న టీవీ నటి ప్రియాంక.. వేదికపైనే జోరుగా ముద్దులు!
టెలివిజన్ యాంకర్, వీడియో జాకీగా రాణిస్తున్న ప్రియాంక దేశ్‌పాండే తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ రెండో వివాహం చేసుకొన్నది. తన పెళ్లికి సంబంధించిన వీడియోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తన వివాహాన్ని గ్రాండ్‌గా చేసుకొన్నారు. రెండో వివాహం చేసుకొని జీవితంలో మరో ఘట్టాన్ని చేరుకొన్న ప్రియాంకు అంతా మంచే జరుగాలని సన్నిహితులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇంతకు ఆమె వివాహం చేసుకొన్న సెలబ్రిటీ ఎవరనే వివరాల్లోకి వెళితే..
ప్రియాంక దేశ్‌పాండే విషయానికి వస్తే.. తమిళంలో పాపులర్ యాంకర్. విజయ్ టెలివిజన్‌లో ఆమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వినోదంతోపాటు తన ప్రతిభతో చకచకా మాట్లాడుతూ ఆకట్టుకోవడం ఆమె నైజం. అయితే ఆమె గతంలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని 20216 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. అయితే 5 ఏళ్ల కాపురం తర్వాత దాంపత్య జీవితంలో విభేదాలు పరిష్కరించుకోలేని స్థాయిలో రావడంతో 2022 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నారు.

ఆ తర్వాత కొన్నాళ్లు సింగిల్‌గా జీవితాన్ని నెట్టుకొచ్చిన ప్రియాంక.. టెలివిజన్ సీరియల్ నిర్మాత వసితో ప్రేమలో పడింది. మనసులు కలిసిన తర్వాత వారిద్దరూ కొంతకాలం ట్రావెల్ అయ్యారు. ఆ తర్వాత తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వివాహం చేసుకోవాలని అనుకొన్నారు. ఇరు కుటుంబాలకు ప్రేమ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. దాంతో వారిద్దరి పెళ్లికి మార్గం సుగమమైంది.
ఇరు కుటుంబాల అంగీకారంతో వసితో ప్రియాంక వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ వివాహానికి అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరయ్యారు. నూతన దంపతులను మిత్రులు, కుటుంబ సభ్యులు దీవించారు. వారి సమక్షంలో దండలు మార్చుకొని తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వివాహానికి హాజరుకాలేని వారు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

అయితే పెళ్లిలో భాగంగా మంగళ సూత్రం కట్టిన తర్వాత ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. వసీ ఒడిలో ఒదిగిపోయి కన్నీటీ పర్యంతం అయ్యారు. ఆనంద భాష్పాలతో ఉన్న తన భార్య ప్రియాంకను ప్రేమతో కౌగిలిలోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొన్నారు. దాంతో ఆమె కూడా తన భర్త వసికి ముద్దు పెట్టారు. ఈ ఎమోషనల్ సీన్ అందర్నీ ఆకట్టుకొన్నది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది.

అయితే మొదటి వివాహంతో చేదు అనుభవం చూసిన ప్రియాంక మరోసారి పెళ్లి చేసుకోవడంపై తల్లి, సోదరుడు ఆనందం వ్యక్తం చేశారు. ఇద్దరు చల్లగా ఉండాలని, వారి దాంపత్య జీవితం సుఖంగా సాగాలని వేడుకొన్నారు. ఇదిలా ఉండగా, నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పెళ్లి వీడియో కింద కామెంట్లు పెడుతూ.. ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణమేమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











