ప్రియుడి పెళ్లికి నిరాకరణ.. కిడ్నాప్ చేసిన టీవీ నటి అరెస్ట్!

ప్రేమలో పడి ప్రేమించుకోవడం చాలా సులభం.. అయితే పెద్దలని ఒప్పించి వివాహం చేసుకోవడం చాలా కష్టమనే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రేమ, పెళ్లికి కుల, మతాలు అడ్డుకావడంతో టెలివిజన్ నటి తెగించడం వివాదాస్పదంగా మారింది. ఆ టీవీ నటి ఎవరు? ఆమె ప్రియుడు ఎవరు? ఈ వివాదంలో అరెస్ట్ గురించి పోలీసులు ఏం చెప్పారు అనే వివరాల్లోకి వెళితే..

టెలివిజన్ నటి, క్రైమ్ పెట్రోల్ అనే సీరియల్ ద్వారా పాపులారిటీని సాధించిన షబ్రీన్ కొన్ని ఏళ్లుగా బ్రిజేష్ అనే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే వారి లవ్, మ్యారేజ్‌కు బ్రిజేష్ కుటుంబం అభ్యంతరం చెప్పింది. కులం, మతాల కారణంతో వారి వివాహానికి నిరాకరించారు. దాంతో తీవ్ర నిరాశకు లోనైన షబ్రీన్ ఏకంగా తన ప్రియుడికి చెందిన మూడున్నర ఏళ్ల అల్లుడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన పాల్‌ఘర్ జిల్లాలోని జరిగిందని పోలీసులు తెలిపారు.

Television Actress Shabreen Arrested in Kidnaping 3 year old boy for opposing Marriage with lover

కిడ్నాప్ ఘటనను చేధించిన పోలీసు మీడియాతో మాట్లాడుతూ... బ్రిజేష్ అనే వ్యక్తితో టీవీ నటి షబ్రీన్ పీకల్లోతు ప్రేమలో ఉంది. అయితే వారి పెళ్లికి పెద్దలు అభ్యంతరం తెలిపారు. దాంతో విచక్షణ కోల్పోయిన ఆమె మూడున్నర సంవత్సరాల పిల్లాడిని ఎత్తుకెళ్లింది. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసి ఈ చర్యకు షబ్రీన్ పాల్పడినట్టు సీసీ ఫుటేజ్‌లో స్పష్టమైంది. దాంతో ఆమెను అరెస్ట చేశాం అని తెలిపారు.

పిల్లాడి కిడ్నాప్ జరిగిందనే ఫిర్యాదు అందుకోగానే స్కూల్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం. ఉదయం 11 గంటల ప్రాంతంలో షబ్రీన్ అక్కడికి వచ్చింది. పిల్లాడు స్కూల్ నుంచి రాగానే అతడిని ఎత్తుకెళ్లింది. అయితే అనుమానం వచ్చి పిల్లాడి అడిగితే.. హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నానని చెప్పింది అనే విషయం వెల్లడైందని పోలీసులు తెలిపారు.

Television Actress Shabreen Arrested in Kidnaping 3 year old boy for opposing Marriage with lover

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా షబ్రీన్ ఈ నేరానికి పాల్పడిందని తెలుసుకొన్నాం. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించగా నయాగావ్‌లోని ఓ ఫ్లాట్‌లో పిల్లాడిని బంధించినట్టు తెలిసింది. వెంటనే మా బృందం వెళ్లటి తనఖీ చేయగా పిల్లాడు ఫ్లాట్‌లో ఉండటంతో వెంటనే షబ్రీన్ అరెస్ట్ చేశాం. అబ్బాయిని వెంటనే బంధువులకు అప్పగించాం అని పోలీసలు తెలిపారు.

సమాజంలో జరిగే నేరాల ఆధారంగా క్రైమ్ పెట్రోల్ అనే సీరియల్‌లో నటించే షబ్రీన్ వాస్తవాలను గుర్తించలేకపోయింది. ప్రియుడు తనకు కాకుండా పోతున్నాననే బాధతో నేరం చేసి కటకటాల వెనక్కి వెళ్లింది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ప్రియుడు బ్రిజేష్ హస్తం ఉందా? అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బ్రిజేష్‌తో మరో అమ్మాయి ఉండటంతో ఆయనపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Read more about: shabreen crime patrol television
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X