Brahmamudi బ్రహ్మముడిలో షర్మిత గౌడకు రెమ్యునరేషన్ ఎంతంటే? రుద్రాణి పాత్రకు పారితోషికం ఎంతంటే?

బుల్లితెరపైన టాప్ రేటింగ్ సీరియల్‌గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్న ధారావాహిక బ్రహ్మముడి. ఈ సీరియల్‌లో మానస్ నాగులపల్లి, దీపిక రంగనాథ్, హమీదా ఖాతూన్, ననైషా రాయ్, షర్మితా గౌడ, కిరణ్ కాంత్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అయితే ఈ సీరియల్‌లో ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకొంటున్న పాత్రల్లో రుద్రాణి పాత్ర ఒకటి. రుద్రాణిగా షర్మితా గౌడ్ అలరిస్తున్నారు. ఆమెకు ఈ పాత్రలో నటించడానికి ఇస్తున్న రెమ్యునరేషన్ ఎంత? నటి వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..

షర్మితా గౌడ విషయానికి వస్తే.. కన్నడకు చెందిన నటి, మోడల్. కర్ణాటకలోని చిక్‌మగళూర్‌లో పుట్టి పెరిగింది. తొలుత మోడల్‌గా రాణిస్తున్న సమయంలో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. జనకి రాఘవ సీరియల్ ద్వారా 2017లో కన్నడ టెలివిజన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందారు.

Television Actress Sharmitha Gowda Remuneration For Rudrani Character in Brahmamudi

ఇక మనేయే మంత్రాలయ అనే సీరియల్ షర్మితకు మంచి పాపులారిటీని సంపాదించి పెట్టింది. ఆమె ఆ సీరియల్‌లో పోషించిన నెగిటివ్ రోల్‌కు మంచి ఆదరణ లభించింది. ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు రావడంతో పాటు ఆ రోల్ భారీగా ఆఫర్లను తీసుకొచ్చేలా చేసింది. ఆ తర్వాత కన్నడలో మంగళ గౌరీ మాదువే సీరియల్‌తో స్టార్ స్టాటస్ అందుకొన్నారు.

ఇక బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఆ పాపులారిటీ రెండితలు అయింది. రుద్రాణి పాత్రలో ఆమె ప్రదర్శించే పెర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. 34 ఏళ్ల వయసులో భారమైన, తన వయసుకు మించిన పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. ఈ సీరియల్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్నది.

Television Actress Sharmitha Gowda Remuneration For Rudrani Character in Brahmamudi

అయితే ఈ సీరియల్‌లో స్ట్రాంగ్ క్యారెక్టర్‌ను ప్లే చేస్తున్న రుద్రాణికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చారని తెలిసింది. టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాలు తెలియజేసిన ప్రకారం.. ప్రతీ రోజు ఆమెకు 15 వేల రూపాయలు చొప్పున పారితోషికం అందిస్తున్నట్టు సమాచారం. ఇలా నెలకు దాదాపు 25 రోజులు సీరియల్స్‌లో నటిస్తూ.. సుమారుగా 5 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X