టీవీ నటి శ్రావణి సూసైడ్: మరణానికి ముందు వీడియో వైరల్.. అమ్మాయిలు మోసపోవద్దు అంటూ

ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్న టెలివిజన్ శ్రావణికి సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. తన మరణానికి ముందు ఎస్ఆర్ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలో మీడియాతో మాట్లాడిన వీడియోలో తన ప్రియుడి వేధింపుల గురించి వెల్లడించారు. శ్రావణి చెప్పిన విషయాలు ఏమిటంటే..

టిక్ టాక్‌, ఇన్స్‌టాగ్రామ్‌తో వలలో

టిక్ టాక్‌, ఇన్స్‌టాగ్రామ్‌తో వలలో

ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత శ్రావణి మీడియాతో మాట్లాడుతూ.. దేవరాజు రెడ్డి అనే అతడు టిక్‌టాక్‌ను వాడుకొని అమ్మాయిలను వలలో వేసుకొంటారు. వారి మొబైల్ నంబర్లు తీసుకొని ఇన్స్‌టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలోకి ఆహ్వానిస్తారు. అక్క, చెల్లి అంటూ మెసేజ్‌లు పెట్టి మోసం చేస్తాడు అని శ్రావణి చెప్పారు.

పరిచయాలు పెంచుకొని డబ్బు లాగుతూ

పరిచయాలు పెంచుకొని డబ్బు లాగుతూ

దేవరాజ్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని డబ్బులు వసూలు చేస్తాడు. ఇంకా వారితో తిరుగుతూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. తన మాట వినకపోతే కొట్టడం, దాడులు చేయడం చేస్తుంటాడు. నన్ను ఎవరూ ఏమి చేయరని బెదిరిస్తుంటాడు అని శ్రావణి తెలిపారు.

అమ్మాయిలను వీడియోలు తీసి బ్లాక్ బెయిల్

అమ్మాయిలను వీడియోలు తీసి బ్లాక్ బెయిల్

అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకొని బెదిరించడం, పర్సనల్‌గా కలిసి వీడియోలు తీయడం చేస్తుంటాడు. వాటిని ఆధారంగా చేసుకొని అన్ని రకాలుగా బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలో అమ్మాయిలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మాటలు చెప్పి బుట్టులో వేసుకొంటాడు. అవసరాల తీరిన తర్వాత వేధిస్తుంటాడు అని శ్రావణి చెప్పారు.

నాకు తెలిసిన వారే ఐదారుగురు యువతులు

నాకు తెలిసిన వారే ఐదారుగురు యువతులు

తన మాదిరిగానే చాలా మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్, మోసాలు చేస్తూ వేధిస్తున్నాడు. నాకు తెలిసిన వారే ఐదు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. దేవరాజ్ కాకినాడకు చెందిన వాడు కానీ సికింద్రాబాద్‌లోనే ఉంటాడు. ఇంతకు ముందు దేవరాజ్‌పై కేసు పెట్టలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని టెలివిజన్ నటి శ్రావణి వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో మీడియాలో వైరల్ అవుతున్నారు.

Recommended Video

Arjuna Veta Movie Launch | Madhu Sai Vamshi | Sravani | Himabindhu || Filmibeat Telugu
టెలివిజన్ నటి శ్రావణి సూసైడ్‌తో

టెలివిజన్ నటి శ్రావణి సూసైడ్‌తో

గత కొద్ది నెలలుగా వేధింపులకు గురైన శ్రావణి మంగళవారం రాత్రి మధురానగర్‌లోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకొన్నారు. విగత జీవిగా పడి ఉన్నఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మనసు మమత, మౌనరాగం లాంటి టెలివిజన్ సీరియల్‌లో నటించి మంచి ప్రేక్షకాదరణను సంపాదించుకొన్నారు. ప్రియుడి వేధింపుల వల్ల జీవితాన్ని అర్ధాంతరంగా చాలించడంతో సన్నిహితులు, స్నేహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X