కరోనా సమయంలో టీవీ నటీనటుల పెళ్లి.. నవ దంపతులపై పోలీసుల కేసు నమోదు!
హిందీ టెలివిజన్ రంగంలో పాపులర్ నటీనటులు సుగంధ మిశ్రా, సంకేత్ భోస్లే ఇటీవలే ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా వారిద్దరూ ఏప్రిల్ 26వ తేదీన నిరాడంబరంగా వివాహం చేసుకొన్నారు. అయితే వారిద్దరిపై పంజాబ్ ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
కరోనావైరస్ కట్టడి చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం విధించిన నిబంధనలు తుంగలో తొక్కుతూ సుగంధ, సంకేత్ ఇద్దరు వివాహం చేసుకొన్నారు. పంజాబ్ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించారని ఇద్దరు టీవీ సెలబ్రిటీలపై అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పెళ్లి జరిగిన రిసార్టు ఓనర్లపై కూడా కేసు నమోదు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అత్రిక్రమించారనే ఆరోపణల కింద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. అలాగే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టాలను అతిక్రమించారని మరికొన్ని కేసులు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఎవరినీ అరెస్ట్ చేయలేదనే విషయాన్ని అధికారులు ధృవీకరించారు.
పెళ్లికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. పెళ్లిలో ప్రభుత్వ ఆంక్షలకు విరుద్దంగా ఎక్కువ మంది పాల్గొన్నారని వెల్లడించారు.


Click it and Unblock the Notifications