Don't Miss!
- Finance
Bank Fraud: బయటపడ్డ వేల కోట్ల లోన్ కుంభకోణం.. కంపెనీపై కేసు నమోదు చేసిన సీబీఐ
- News
YS Jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్? ఆ పర్యటనలు రద్దు! అవినాష్ కు సీబీఐ నోటీసులతో!
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Anchor Pradeep: పెళ్లి చేసుకునే ఆలోచనలో యాంకర్ ప్రదీప్.. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ తోనే ఫ్యూచర్ ప్లాన్?
టెలివిజన్ ప్రపంచంలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న వారిలో యాంకర్ ప్రదీప్ ఒకరు. తెలుగు టెలివిజన్ వరల్డ్ లో అతనికి మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యాంకర్స్ లలో కూడా అందరికంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ అతనే అందుకుంటున్నాడు. అయితే యాంకర్ ప్రదీప్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా అతనికి ఎప్పటి నుంచో తెలిసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

టాప్ యాంకర్
యాంకర్ ప్రదీప్ మొదట సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలని అనుకున్నాడు. ఇక ఆ తర్వాత టెలివిజన్ రంగంలో అతనికి మంచి గుర్తింపు రావడంతో అక్కడే చాలా బిజీ గా మారిపోయాడు. మొదట అతను చిన్నచిన్న టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా గుర్తింపు అందుకుంటూ ఆ తర్వాత రియాల్టీ షోలతో మంచి యాంకర్ గా గుర్తింపును అందుకున్నాడు. ప్రదీప్ ఎలాంటి షో చేసిన కూడా అందులో మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేస్తాడు.

హీరోగా సక్సెస్
ముఖ్యంగా యాంకర్ ప్రదీప్ కొంచెం టచ్ లో ఉంటే చెబుతా.. అనే స్పెషల్ టాక్ షో ద్వారా కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులను అతను ఇంటర్వ్యూ చేయడం హైలైట్ గా నిలిచింది. అయితే ఇటీవల అతను హీరోగా కూడా అడుగులు వేసిన విషయం తెలిసిందే. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద అతను మంచి సక్సెస్ అందుకున్నాడు.

పెళ్లిపై వార్తలు
ఇక యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి చాలా కాలంగా అనేక రకాలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే అతను ఒక టెలివిజన్ నటిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ కుటుంబ సభ్యులు వారి బంధువులలోనే ఒక అమ్మాయిని చూశారు అని ఇప్పటికే పెళ్లి చూపులు కూడా అయిపోయినట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంపై ప్రదీప్ ఎప్పుడూ కూడా క్లారిటీ ఇవ్వలేదు

అప్పట్లో స్వయంవరం
ఆ మధ్యకాలంలో ఒక టెలివిజన్ షో నిర్వహించిన యాంకర్ ప్రదీప్ స్వయంవరం పేరుతో పెళ్లికి రెడీ అయ్యాడు అని న్యూస్ కూడా వైరల్ గా అయిన విషయం తెలిసిందే. అయితే ఆ షో ద్వారా అతను కొన్ని చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా యాంకర్ ప్రదీప్ మాత్రం పెళ్లి విషయంలో సైలెన్స్ ప్రైవసీ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు.

స్నేహితురాలితో పెళ్లి?
అయితే మొత్తానికి ప్రదీప్ ఇప్పుడు తనకు ఎప్పటినుంచో తెలిసిన ఒక స్నేహితురాలిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా టెలివిజన్ రంగంలో బాగానే క్రేజ్ అందుకున్నట్టుగా కూడా టాక్ వస్తోంది. దాదాపు ప్రదీప్ కు సంబంధించిన ప్రతీ టెలివిజన్ షోకు కూడా ఆమె వర్క్ చేసినట్లు సమాచారం.

బిగ్ బాస్ కోసం..
అయితే ఆమెతో పరిచయం ప్రేమ వరకు వెళ్ళింది అని కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు అని తెలుస్తోంది. ఇటీవల ఆమె బిగ్ బాస్ కు సంబంధించిన కంటెస్టెంట్స్ కు ఫ్యాషన్ డిజైనర్ గా కూడా వర్క్ చేసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ప్రదీప్ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాల్సిందే.