ఇంట్లో ఇల్లాలు.. ఇండస్ట్రీలో ప్రియరాలు.. తప్పు ఒప్పుకున్న బుల్లితెర మెగాస్టార్..
బుల్లితెర నటుడు ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తెలుగు టీవీ ఇండస్ట్రీలో మెగాస్టార్ అని ఆయన పిలుస్తూ ఉంటారు. ఎన్నో ఏండ్లు సూపర్ హిట్ సీరియల్లలో నటిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. ఆయన ఎక్కువగా ఈటీవీ లో ప్రసారమయ్యే సీరియల్లో నటించడంతో ఆయన ఇంటి పేరు ఈటీవీగా మారిపోయింది. అందుకే అనడం 'ఈటీవీ ప్రభాకర్' అని పిలుస్తారు. ఆయన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతో సక్సెస్ అందుకున్న.. పర్సనల్ లైఫ్ లో కొన్ని తప్పులు చేశానని, తానే స్వయంగా తన ఒప్పుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
ఇండస్ట్రీలో రూమర్స్ చెలరేగడం సర్వసాధారణం. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి తో కలిసి తిరిగితే వారి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఏదో ఒక రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అసలు నిజాలు తెలియకుండా సంబంధాలను అంటగట్టేస్తుంటారు. ఈ రూమర్స్ అనేవి రియల్ లైఫ్ లోను.. రీల్ లైఫ్ లోను.. ఎప్పుడూ ఆ టాపిక్ గానే నిలుస్తాయి. అయితే కొన్ని రూమర్సులలో నిజాలు కూడా ఉంటాయి. వాటిని తప్పు అని ఒప్పుకునేవారు కొందరు మాత్రమే ఉంటారు. అలా తమ తప్పుల్ని తెలుసుకొని తమ జీవితాన్ని సరిదిద్దుకునే వారు కూడా కొంతమంది ఉంటారు. అందులో ఒక్కరు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్. ప్రభాకర్ తన జీవితంలో జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి, తన జీవితంలో వచ్చిన మరో వ్యక్తి కారణమంటూ చెప్పుకొచ్చారు.

ఈటీవీ ప్రభాకర్ తన జీవితంలో చేసిన తప్పు గురించి ఓ యూట్యూబ్ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. తన చేసిన జీవితంలో చేసిన తప్పులను రివీల్ చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను ప్రేమించి.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నానని, తన వివాహం ఆర్య సమాజంలో స్నేహితుల సమక్షంలో జరిగిందని పేర్కొన్నారు. అయితే తన ఆవిడ (మలయజ) తనని ఎంతగానో నమ్మి తన జీవితంలోకి అడుగు పెట్టిందన్నారు. అలాంటి అమ్మాయిని కొన్ని విషయాలలో తాను చాలా బాధ పెట్టానని ఫీలయ్యాడు. ఒకానొక సమయంలో తాను తెలుసో.. తెలియకో ఇంకొకరితో రిలేషన్ లో ఉండడం వల్ల తన భార్య ఎంతగానో బాధ పడిందని, తనకు చెప్పుకోలేక ఎంతో బాధపడిందని పేర్కొన్నారు.
ఆ తప్పు ఎలా జరిగిందో.. జరిగిపోయింది. తన భార్యను కన్విస్ చేయడానికి చాలా ప్రయత్నించాలని, ఆ విషయంలో మాత్రం తన భార్య తన మాట వినలేకపోయిందని, వేరే అమ్మాయికి దగ్గర కావడంతో తనని మోసం చేశాడని చాలా బాధపడిందని ప్రభాకర్ అన్నారు. అయితే తనకు తెలుసు గాని తెలియగానే తన భార్యను మాత్రం ఎన్నడూ దూరం పెట్టలేదని, ఇటువైపు వచ్చిన వ్యక్తి కూడా తాను మొదటి రోజు నుండే తన భార్య,పిల్లల గురించి తన జీవితం గురించి చెప్పుకొచ్చానని, అలాగనే తమ రిలేషన్ ను కంటిన్యూ చేశామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ దేవుని చల్లని దీవెన వల్ల తాను ఓ మంచి నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

ఆ నిర్ణయంతో తన లైఫ్ మళ్లీ గాడిలో పడిందని, ప్రస్తుతం తాను, తన పిల్లలు, భార్య అంతా బాగున్నావని ప్రభాకర్ పేర్కొన్నారు. తాను చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం తన భార్య కల్పించిందని ప్రభాకర్ ఎమోషనల్ అయ్యారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని మనం మంచి ఇస్తే మంచే జరుగుతుందని అదే చెడు చేస్తే చెడు ఎదురవుతుందని తెలిపారు. మంచి చెడుల మధ్య తారతమ్యం తెలిసిన వాడే అసలైన మనిషి అని టోటల్గా మంచి వాడు గాని, టోటల్గా చెడ్డవాడు గాని ఉండడని, మన రక్తంలో కొలెస్ట్రాల్ ఉన్నట్లుగానే ప్రతి మనిషిలో మంచి చెడు అని ఉంటాయని, కాకపోతే చెడుకు లొంగిపోకుండా.. మంచివైపు ప్రయాణిస్తే జీవితం సంతోషంగా సాగిపోతుందని పేర్కొన్నారు ఈ టీవీ ప్రభాకర్. తన భార్య మీద కొత్త ప్రేమ పుట్టిందని, ఎందుకంటే తన గొప్పదనం ఆ సంఘటన వల్ల తెలిసిందని తన భార్యను పొగడ్తలతో ముంచేత్తాడు.


Click it and Unblock the Notifications











