విడాకుల బాట పట్టిన పాపులర్ బుల్లితెర సెలబ్రిటీ జంట... ఇద్దరు పిల్లలు పుట్టాక షాకింగ్ నిర్ణయం!
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా సెలబ్రిటీ కపుల్స్ విడిపోతున్నారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా బుల్లితెర జంట ప్రియతమ్ చరణ్, మానస కూడా విడాకులు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి వీరిద్దరూ విడాకుల బాట పడుతున్నారని వార్తలు రావడానికి కారణం ఏంటి అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
ఈ రంగుల ప్రపంచంలో లవ్, మ్యారేజ్, డీవోర్స్ ఎప్పుడు జరుగుతాయో ఊహించడం కూడా కష్టంగా మారుతోంది. ఆ వార్తలు తగ్గట్టుగానే చాలామంది లవ్ చేసి పెళ్లి చేసుకున్న జంటలు కూడా పెళ్లయిన అతి కొద్ది కాలానికే వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి షాక్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో నయనతార, విగ్నేష్ పై ఇలాంటి రూమర్లు ఎక్కువగా వినిపించాయి. అలాగే కలర్స్ స్వాతి కూడా విడాకుల వార్తల కారణంగా అందరి దృష్టిలో పడింది.

టెలివిజన్ సెలబ్రిటీ కపుల్ ప్రియతమ్ చరణ్, మానస బుల్లితెర ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. మనసు మమత సీరియల్ ద్వారా టెలివిజన్ హీరోగా మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు చరణ్. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా వరుసగా సీరియల్స్ చేస్తూ వస్తున్నాడు.
పాపే మా జీవన జ్యోతి అనే సీరియల్ లో నటిస్తున్న చరణ్ సీరియల్ నటి మానసపై మనసు పడి మరీ వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరు కొడుకులకు తల్లిదండ్రులు అయ్యారు. అయితే ఇటీవల కాలంలో చరణ్, మానస డివోర్స్ తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా చరణ్ చేసిన ఓ వీడియో డివోర్స్ వార్తలకు ఆజ్యం పోసినట్టుగా అయ్యింది. సోషల్ మీడియాలో తన కొడుకులను తలుచుకొని ఏడుస్తున్నట్లుగా వీడియోను షేర్ చేశాడు చరణ్. మరోవైపు మానస మాత్రం కొడుకులతో కలిసి సపరేట్ గా బ్లాగ్స్ చేస్తూ కనిపిస్తోంది. వాటిలో ఎక్కడా చరణ్ మాత్రం కనిపించట్లేదు.
దీంతో ప్రీతం మానస విడాకులు తీసుకోబోతున్నారని, దానికి సాక్ష్యం ఇదేనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా చరణ్ వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్న కారణంగానే మానస అతనికి దూరంగా ఉంటుందని, ఈ కారణం చేతనే వీళ్ళిద్దరి ప్రేమ బంధానికి బ్రేక్ పడి విడాకులకు దారి తీసింది అని నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అంతేకాకుండా చాలాకాలం నుంచే వీరిద్దరూ విడివిడిగా ఉంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని గత ఏడాది ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మానస స్వయంగా బయట పెట్టింది. తాను ఇప్పటికైనా స్టాండ్ తీసుకోకపోతే పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో అంటూ మానస ఆందోళన వ్యక్తం చేసింది.
ఇద్దరం తప్పులు చేసినప్పటికీ ఫలితం మాత్రం తానే అనుభవిస్తున్నాను అంటూనే విడాకులు తీసుకోవాలని కోరుకోవట్లేదు అని చెప్పుకొచ్చింది మానస. ఆమె అన్నట్టుగానే ఇప్పటిదాకా ఈ జంట విడాకులు మాత్రం తీసుకోలేదు. తాజాగా ఆ పని కూడా పూర్తి చేశారని టాక్ నడుస్తోంది. అందుకే చరణ్ తన పిల్లలను మిస్ అవుతున్న విషయాన్ని ఇలా బయట పెట్టాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











