విడాకులు తీసుకోబోతున్న మరో బుల్లితెర జంట.. స్టేజీమీదే ప్రకటించి షాక్!
ఈ మధ్య కాలంలో అనేక మంది సెలబ్రిటీలు వెంటనే ప్రేమలో పడిపోవడం, పెళ్లి పీటలు ఎక్కేయడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం చాలా కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా వీరికి సంబంధించిన పర్సనల్ లైఫ్ ను కూడా టీవీల్లో చూపించడంతో మరింత ఎక్కువ పాపులర్ అయిపోతున్నారు. ఇటీవలే ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని.. అతడితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న జబర్దస్త్ పవిత్ర.. వాలెంటైన్స్ డే రోజు తామిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.
ఇప్పుడు తాజాగా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నట్లు స్టేజీ మేదే ప్రకటించి అందిరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఇలా టీవీలోని అనేక ఈవెంట్లలో తమ ప్రేమ విషయం ప్రకటించి... ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ చేసుకుని, పెళ్లి కూడా చేసుకున్నారు. చాలా కాలంగా హాయిగా కాపురం చేసుకుంటున్న వీరు.. ఇప్పుడు విడిపోవాలని డిసైడ్ అయినట్లు స్టేజీ మీదే ప్రకటించారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జబర్దస్త్, ఢీ జోడీ.. ఇలా అనేక షోలలో పాల్గొనే పాపులర్ సెలబ్రిటీల పర్సనల్ విషయాలను కూడా చూపిస్తూ ఎప్పుడూ టీఆర్పీని పెంచుకుంటారు. ఇలా సుధీర్, రష్మిలకు విష్ణుప్రియ, రష్మిలకు చాలా సార్లే పెళ్లిళ్లు చేసేశారు. ఆదికి కాబోయే ఆవిడ ఈమేనంటూ కూడా చూపించారు. సద్దాంకు గర్ల్ ఫ్రెండ్ ఈమేనంటూ కూడా స్టంట్లు చేశారు. అయితే రియల్ కపుల్... యాదమ్మ రాజు, స్టెల్లాల స్టోరీని మాత్రం కరెక్టుగా చూపించారు. యాదమ్మ రాజుకు.. స్టెల్లాను స్టేజీ మీదకు తీసుకు వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఇలా షోలోనే తొలిసారి తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన యాదమ్మ రాజు ఆ తర్వాత పలు ప్రోగ్రాంలలో ఆమెకు ప్రపోజ్ చేసి, ఉంగరం తొడిగాడు. నిజ జీవితంలో కూడా నిశ్చితార్థం, ఆ తర్వాత గ్రాండ్ గా పెళ్లి చేసుకుని.. అన్యోన్యమైన జంటగా సాగుతున్నారు. అయితే తాజాగా వీరిద్దరూ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు వచ్చారు. కామెడీ చేసేందుకు వచ్చిన వీరు విడాకులు తీసుకుంటామని గొడవ పడ్డారు. ముందుగా యాదమ్మ రాజు ఫోన్ చూసి... పలువురి గురించి స్టెల్లా ఆరా తీసింది. అతడు మాత్రం సమాధానం చెప్పలేదు.

దీంతో నాకు విడాకులు ఇచ్చేస్తావా అని స్టెల్లా అనడం.. నువ్వే ముందు విడాకులు అడిగావు కాబట్టి ఇచ్చేస్తానంటూ యాదమ్మ రాజు గట్టిగా వాదించాడు. మాకు విడాకులు కావాలంటూ ఇద్దరు కలిసి రచ్చ చేశారు. అయితే ఇది కూడా స్టంట్ యే అని ఈజీగా అర్థం అయిపోతుంది. ఆహ్వానం సినిమాకు వీరు స్పూఫ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా గొడవ పడ్డ వీరిద్దరిలో.. పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసుకున్నావో, విడాకులు కూడా అంతే గ్రాండ్ గా కావాలని స్టెల్లా పట్టుబట్టడం.. ఆ తర్వాత వీరి విడాకులు మహోత్సవానికి గెస్టులను పిలవడం చేశారు. ఇలా షోను నడిపించారు.
కానీ చివరలో మాత్రం అందరికీ గొడవలు వస్తాయి.. కానీ కలిసుండాలి అంటూ మంచి మెసేజ్ చెప్పారు. ముఖ్యంగా అందరి పెళ్లి రోజు ఫొటోలు ప్లే చేస్తూ వారి స్టోరీలు చెప్పించి మరీ... యాదమ్మ రాజు, స్టెల్లాలను కలిపేశారు. ఆ ఫొటో చూడగానే స్టెల్లా చాలా ఎమోషనల్ అయింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజీ.. ఒప్పించడానికి వాళ్లు పడ్డ కష్టం గురించి చెప్పి ఏడ్చేసింది. జీవితాంతం తాము చాలా సంతోషంగా ఉంటామని చివర్లో చెప్పింది. ఇలా వీరిద్దరూ మళ్లీ కలిసిపోయి చాలా హ్యాపీగా కనిపించారు.


Click it and Unblock the Notifications











