బిగ్ బాస్‌లోకి శ్రీరెడ్డి లాంటి హీరోయిన్.. 100 రోజులు శృంగారం లేకుండా అంటూ!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ఇండియాలోకి ప్రవేశించి.. చాలా ఆలస్యంగా తెలుగు ప్రేక్షకులను పలకరించినదే 'బిగ్ బాస్'. అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అయిన ఇది.. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషనల్ రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా తెలుగు షో దేశంలోనే నెంబర్ స్థానానికి ఎదిగింది. ఈ కారణంగానే నిర్వహకులు ఏమాత్రం గ్యాప్ లేకుండా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా త్వరలోనే ఎనిమిదో దాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందులోకి ఓ కాంట్రవర్శీ హీరోయిన్ రాబోతుంది. ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

ఒకదానికి మించి మరొకటి
హిందీలోకి బిగ్ బాస్ షో 18 ఏళ్ల క్రితమే వచ్చినా.. తెలుగులో మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను నిర్వహకులు పూర్తి చేసుకున్నారు. వీటికి ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా రేటింగ్ లభించింది. తద్వారా ఎన్నో భాషల్లో వస్తున్నా తెలుగు బిగ్ బాసే దేశంలోనే నెంబర్ వన్ అనిపించుకుంది.

Telugu Actress Gayathri Gupta Likely Entry To Bigg Boss Telugu 8 Show

అంతులేని వినోదంతోనే

ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎనిమిదో దానిపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఎనిమిదో సీజన్‌ను 'అంతులేని వినోదం' (ఇన్ఫినిటీ ఎంటర్‌టైన్‌మెంట్) అనే కాన్సెప్టుతో తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా పనులు మొదలయ్యాయి. ఫలితంగా ఈ సీజన్‌పై హైప్ పెరుగుతోంది.

8వ సీజన్ వివరాలు ఇవే
ఏడో సీజన్ గ్రాండ్ సక్సెస్ అవడంతో ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే అఫీషియల్ లోగోను విడుదల చేశారు. ఇక, ఈ సీజన్‌ను సెప్టెంబర్ మొదటి వారం నుంచే ప్రారంభించబోతున్నారని ఇప్పటికే న్యూస్ లీకైంది. అలాగే, ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల కోసం వడబోతను కూడా నిర్వహకులు గట్టిగానే చేస్తున్నారు.

బిగ్ బాస్‌ షోలో గాయత్రి

ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను నిజం చేయాలన్న లక్ష్యంతో మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు కూడా ఒక్కొక్కటిగా లీక్ అవుతన్నాయి. ఇలా ఇప్పుడు ఓ క్రేజీ సెలెబ్రిటీ పేరు బయటకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. కాంట్రవర్శీ హీరోయిన్ 'గాయత్రి గుప్తా' ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వస్తుందట.

Telugu Actress Gayathri Gupta Likely Entry To Bigg Boss Telugu 8 Show

ఒప్పుకున్న గాయత్రి గుప్తా
తెలుగు పిల్ల గాయత్రి గుప్తా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 'ఫిదా', 'ఐస్‌క్రీమ్ 2', 'కొబ్బరిమట్ట', 'మిఠాయి' వంటి చిత్రాలు చేసింది. అయితే, కాస్టింగ్ కౌచ్ కాంట్రవర్శీని తెరపైకి తెచ్చి వివాదాన్ని రేపింది. అప్పటి నుంచి కెరీర్ గాడితప్పింది. కానీ, ఈ మధ్య మళ్లీ ఆఫర్లు అందుకుంటోంది. ఇలా ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని తాజాగా తెలిసింది.

100 రోజులు శృంగారం

వాస్తవానికి గాయత్రి గుప్తాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లోనే ఆఫర్ వచ్చింది. కానీ ఆమె ఎందుకనో వెళ్లలేదు. పైగా షో నిర్వహకులు చేసిన ఇంటర్వ్యూలో 'మీరు 100 రోజులు శృంగారం లేకుండా ఉండగలరా? అని నన్ను ప్రశ్నించారు' అని ఆరోపణలు చేసింది. తర్వాత బిగ్ బాస్ షోను నిషేదించాలని పోరాటం కూడా చేసింది. అలాంటి గాయత్రి ఇప్పుడు అదే షోలోకి వస్తుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X