అందుకే మరోసారి తల్లిని అవ్వాలని అనుకుంటున్నా..అసలు విషయాన్ని బయటపెట్టిన జబర్దస్త్ యాంకర్

బుల్లితెరపై స్టార్ యాంకర్స్ ఎంతమంది ఉన్నా కూడా అనసూయ భరద్వాజ్ కు ఉండే క్రేజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఎలాంటి షో చేసినా కూడా మాటలతో పాటు గ్లామర్ తో కూడా హీటెక్కించే ఈ సీనియర్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ చేయడంలో కూడా ముందుంటుంది. ఇక ఇటీవల ఒక పోస్టర్ లో గర్భవతి లుక్ లో కనిపించి షాక్ ఇచ్చిన అనసూయ రియల్ లైఫ్ లో మరోసారి తల్లి అవ్వడం గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది.

డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయినా కూడా

డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయినా కూడా

కేవలం టీవీ షోలతోనే కాకుండా సినిమాల ద్వారా నటిగా కూడా అనసూయ తన స్థాయిని పెంచుకుంటోంది. గ్లామర్ రోల్స్ అని కాకుండా కాస్త కొత్తగా ఆకట్టుకోవాలని ట్రై చేస్తోంది. పాత్ర కాస్త డిఫరెంట్ గా అనిపించినా కూడా ఏ మాత్రం రిజెక్ట్ చేయడం లేదట. బిజీగా ఉన్నా డేట్స్ లేకపోయినా కూడా కొన్ని సినిమాల కోసం ఓవర్ టైమ్ పని చేయడానికి కూడా అమ్మడు రెడీ అవుతోందట.

ఫస్ట్ లుక్ తో షాక్ ఇచ్చిన అనసూయ

ఫస్ట్ లుక్ తో షాక్ ఇచ్చిన అనసూయ

క్షణం సినిమా తరువాత రంగమ్మత్త పాత్ర ఎప్పుడయితే క్లిక్కయ్యిందో అప్పటి నుంచి అనసూయ వెనక్కి తగ్గడం లేదు. వీలైనంత వరకు పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటోంది. ఇక ఇటీవల థాంక్యూ బ్రదర్ అనే టైటిల్ తో ఒక పోస్టర్ రిలీజ్ చేయగా.. అందులో ఫస్ట్ లుక్‌తోనే అందర్నీ షాక్‌కు గురి చేసింది. ముందుగా అనుకున్నట్టు అనసూయ గర్భవతిగా నటిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో అనసూయ డీ గ్లామర్ లుక్‌లో బాగానే ఆకట్టుకుంటోంది.

అందుకే మరోసారి తల్లి కావాలని..

అందుకే మరోసారి తల్లి కావాలని..

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు మరోసారి తల్లి కావాలని ఉందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలున్న విషయం తెలిసిందే. ఇక నిజజీవితంలో మరోసారి మాతృత్వం యొక్క ఆనందం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పిన అనసూయ.. ప్రెగ్నెంట్ ఉమెన్ గా ఉన్నప్పుడు నాకు దక్కిన అన్ని విలాసాలను ఎంతగానో ఇష్టపడ్డాను. అందుకే మరోసారి ఆ ఆనందాన్ని కోరుకోవాలని అనుకుంటున్నాను.. అనసూయా తెలియజేసింది.

సినిమాలతో బిజీబిజీగా..

సినిమాలతో బిజీబిజీగా..

అనసూయ అలా చెప్పడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ గా మారుతోంది. అనసూయ తల్లి పాత్రను ఎంతగా గౌరవిస్తుందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ ఈ సినిమాతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. రవితేజ కిక్ సినిమాలోనే కాకుండా కృష్ణ వంశీ రంగమార్తాండలో కూడా జబర్దస్త్ యాంకర్ ఒక స్పెషల్ పాత్రలో మెరవనుందట. మరి ఆ పాత్రలు అమ్మడి రేంజ్ ని ఇంకా ఏ స్థాయికి పెంచుతాయో చూడాలి మరి..

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
సినిమాలతో బిజీబిజీగా..

సినిమాలతో బిజీబిజీగా..

అనసూయ అలా చెప్పడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ గా మారుతోంది. అనసూయ తల్లి పాత్రను ఎంతగా గౌరవిస్తుందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ ఈ సినిమాతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. రవితేజ కిక్ సినిమాలోనే కాకుండా కృష్ణ వంశీ రంగమార్తాండలో కూడా జబర్దస్త్ యాంకర్ ఒక స్పెషల్ పాత్రలో మెరవనుందట. మరి ఆ పాత్రలు అమ్మడి రేంజ్ ని ఇంకా ఏ స్థాయికి పెంచుతాయో చూడాలి మరి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X