ఎన్టీఆర్ ఉంటేనే వెళ్లలేదు.. బిగ్ బాస్ 4 అంటే పళ్ళు పగలగొట్టుకోవడమే: యాంకర్ ఝాన్సీ

బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో అవకాశం రావాలని నార్త్ సైడ్ చాలా మంది సెలబ్రెటీస్ ఎదురుచూస్తుంటారు. తెలుగులో కూడా ఓ వర్గం నటీనటులు హౌజ్ లోకి వెళ్లి జనాలని వారికి నచ్చినట్లుగా ఆకర్షించాలని అనుకుంటారు. అయితే రెమ్యునరేషన్ ఎంత ఆఫర్ చేసినా కూడా రిజెక్ట్ చేసేవారు కూడా ఉన్నారు. అందులో యాంకర్ ఝాన్సీ కూడా ఉన్నారు. రీసెంట్ గా ఈ సీనియర్ యాంకర్ బిగ్ బాస్ షో పై ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేసింది.

బిగ్ బాస్ 4..

బిగ్ బాస్ 4..

ప్రస్తుతం ఇండస్ట్రీలో సినీ టెక్నీషియన్స్ కి మరొక కొత్త తలనొప్పి వచ్చి పడింది. కరోనా వల్ల సినిమా థియేటర్స్ ని ఇప్పట్లో తెరిచేది లేదని ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో కోట్లాది రూపాయల బిజినెస్ నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. జనాలు ఎక్కువగా టీవీలకె అతుక్కుపోవడంతో ఏదైనా రియాలిటీ షోలతో ఆకట్టుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఇక త్వరలో బిగ్ బాస్ 4 కూడా టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

సాధ్యమేనా..

సాధ్యమేనా..

ప్రస్తుతం సామాజిక దూరం తప్పనిసరి అని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అందరికి ఒక అవగాహన ఏర్పడింది. అయితే బిగ్ బాస్ 4 కోసం ఇప్పుడు ప్రణాళికలు రచిస్తున్నారనే టాక్ వస్తోంది. కానీ అలా చేస్తే నిబంధనలను అతిక్రమించనట్లు అవుతుంది. సామజిక దూరం అవసరం కాబట్టి టెలివిజన్ కి అతుక్కుపోయే ఓ వర్గం ఆడియెన్స్ లో ఈ షో భిన్నాభిప్రాయాలను కలిగించే అవకాశం ఉంది కాబట్టి షో జరగడం సాధ్యమేనా అనే టాక్ వస్తోంది. అదే విషయంపై యాంకర్ ఝాన్సీ స్పందించింది.

ఎన్టీఆర్ ఉంటేనే వెళ్లలేదు..

ఎన్టీఆర్ ఉంటేనే వెళ్లలేదు..

ఇటీవల ఝాన్సీ నెటీజన్స్ తో చిట్ చాట్ చేయగా.. అందులో ఎక్కువగా బిగ్ బాస్ 4లో అవకాశం వేస్తే వెళతారా? అనే ప్రశ్నలు వచ్చాయి. అందుకు స్పందించిన ఝాన్సీ.. నేను ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు అవకాశం వస్తేనే.. వెళ్లలేదు. ఇక ఇలాంటి సమయంలో వెళ్లడం అంటే.. రాయితో మన పళ్ళు మనం ఉడగొట్టుకోవడమే అని ఝాన్సీ వివరణ ఇచ్చింది.

Recommended Video

Simbu Asked TV Organisers To Delete some Portions Of Interview About Nayanatara & Hansika
అలా ఉండలేను..

అలా ఉండలేను..

నాలుగు గోడల మధ్య మధ్య నన్ను బాధ పెట్టుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదని చెబుతూ.. బిగ్ బాస్ షోపై తనకు ఏ మాత్రం ఇంట్రెస్ లేదని ఝాన్సీ వివరణ ఇచ్చింది. ఇక గత సీజన్ ఫైనల్ లో శ్రీముఖి గెలవకపోవడంపై ఝాన్సీ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. అమెరికలోనే ఒక మహిళను అధ్యక్షురాలిగా చేయాలని అనుకోవడం లేదని.. అలాంటిది తెలుగు ప్రేక్షకులు ఒక అమ్మాయిని బిగ్ బాస్ షోలో గెలిపిస్తారా? అంటూ అప్పట్లో ఝాన్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X