twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ మంజూష మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. హాట్ ట్రీట్.. వాళ్లకు పోటీ ఇచ్చేలా రెమ్యునరేషన్!

    |

    యాంకర్ లలో ఇటీవల కాలంలో ఎక్కువగా గ్లామర్ తో ఆకట్టుకుంటున్న యాంకర్స్ లిస్ట్ తీస్తే అందులో మంజూష రాంపల్లి కూడా టాప్ లిస్టులో ఉంటుందని చెప్పవచ్చు. ఒకప్పుడు చాలా హోమ్లీ అమ్మాయి గా కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం ట్రెండ్ కి తగ్గట్టుగా గ్లామరస్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో చాలా చక్కగా మాట్లాడే ప్రముఖ యాంకర్ అని చెప్పవచ్చు. ఇక సినిమాల ఇంటర్వ్యూలలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. రీసెంట్ గా యాంకర్ మంజూష కు సంబంధించిన మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

    మొదట ఎన్టీఆర్ సినిమాలో..

    మొదట ఎన్టీఆర్ సినిమాలో..

    యాంకర్ మంజూష సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలం అవుతుంది. గతంలో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికీ నటిగా మాత్రం మంచి గుర్తింపును అందుకున్నారు. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకున్న మంజూష మొదట రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సోదరి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఆమెకు సిస్టర్ తరహా పాత్రలు కూడా చాలానే వచ్చాయి.

    యాంకర్ గా మంచి గుర్తింపు

    యాంకర్ గా మంచి గుర్తింపు

    యాంకర్ మంజూష మొదట సినిమాతోనే వెండితెరపై మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఇక ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా ఆమె యాంకర్ గా కొనసాగుతూ మరిన్ని ఆఫర్స్ అందుకుంటూ వచ్చారు. తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతూ ఉండడంతో కొన్ని ప్రముఖ సినిమాల ఆమెను ప్రత్యేకంగా పోస్ట్ గా నియమిస్తూ వస్తున్నారు.

    వారికి తగ్గట్టుగానే గ్లామర్ డోస్

    వారికి తగ్గట్టుగానే గ్లామర్ డోస్

    ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో తెలుగు చాలా చక్కగా మాట్లాడే యాంకర్స్ కొందరే ఉన్నారని చెప్పాలి. వాళ్లు కూడా గ్లామర్ లో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడంతో కొన్ని ఆఫర్స్ తగ్గుతున్నాయి అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక యాంకర్ అనసూయ రష్మీ వంటివారు రోజురోజుకీ వారి గ్లామర్ డోస్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక వారికి తగ్గట్లుగానే మంజూష కూడా తన గ్లామర్ తో మంచి ఆఫర్స్ అందుకుంటోంది.

    మితి మీరకుండా..

    మితి మీరకుండా..

    గ్లామర్ ప్రజెంటేషన్ లో ఎక్కువగా మితి మీరకుండా ఆమె కుర్రాళ్లను ఆకట్టుకునే విధంగా దర్శనం ఇస్తోంది. ఇక ఎలాంటి డ్రెస్ వేసినా కూడా వయ్యారాలు హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇస్తోంది. ఇక ఇటీవల కూడా ట్రెండీ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో ట్రెండ్ లిస్ట్ లో చేరాయి.

    టాప్ లిస్టులో..

    టాప్ లిస్టులో..

    యాంకర్ మంజూష ఎక్కువ సినిమాలు చేయక పోయినప్పటికీ ఆమెకు అనేక రకాల ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదాయాన్ని అందుకుంటోంది. ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లలో తెలుగు చాలా చక్కగా మాట్లాడే వారిలో ఆమె టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. దానికి తోడు ఆమె గ్లామర్ డోస్ కూడా పెంచడంతో చాలా హైలెట్ అవుతున్నారు.

    రెమ్యునరేషన్ ఎంతంటే?

    రెమ్యునరేషన్ ఎంతంటే?

    ఇక ప్రస్తుతం యాంకర్స్ లలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో సుమ అనసూయ భరద్వాజ్ రష్మి వంటివారు టాప్ లిస్టులో కొనసాగుతున్నారు. ఇక వారి తరువాత యాంకర్ మంజూష కూడా మెల్లగా తన ఆదాయాన్ని పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఇక గ్లామర్ డోసు కూడా పెంచుతూ ఉండడంతో యాంకర్ మంజూష ఈవెంట్స్ కు అలాగే ప్రత్యేకంగా చేసే ఇంటర్వ్యూలకు కూడా 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Telugu Anchor manjusha latest glamorous hot photos..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X