ఆవకాయ పెడుతూ యాంకర్ మంజూష హాట్ షో.. అలా కనిపించి నెటిజన్లకు షాకిచ్చిన యాంకరమ్మ

ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన యాంకర్ మంజూష ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అడపా దడపా.. కొన్ని సినిమాల్లో నటించినా అవేవీ ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు. కేవలం ఆమె ఒక హాట్ యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకుంది మంజూష. మంజూష తాజాగా ఓ ఫోటోను ఫాలోవర్స్ తో పంచుకుంది. ఆ ఫోటోలో కొత్త మామిడి కాయ పచ్చడి పెడుతూ ఆమె చేసిన కామెంట్స్,ఆ ఫోటోలో ఆమె డ్రెస్ వైరల్‌గా మారింది ఆ వివరాల్లోకి వెళితే .

నటన మీద ఆసక్తితో

నటన మీద ఆసక్తితో


పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో జన్మించిన మంజూషకి చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. అందుకే ఆమె పదిహేనేళ్ల వయసులో సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది.. అదే సమయంలో 2006 సినిమా లో కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రాఖీ సినిమా ఆడిషన్స్ కోసం అటెండ్ అయింది. అలా అటెండ్ కాగా అందులో జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలు పాత్ర కోసం ఆమె ఎంపికైంది.

ఎన్టీఆర్ చెల్లెలుగా

ఎన్టీఆర్ చెల్లెలుగా

రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలుగా ఆమె నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పవచ్చు. అదనపు కట్నం కోసం వేధించే భర్త, అత్తల ద్వారా అనేక బాధలు పడిన ఆమె చివరికి చనిపోతుంది. అప్పటి నుంచి సినిమా మరో మలుపు తిరిగుతుంది. ఇక ఈ పాత్రలో సహజమైన నటనతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

వరుస అవకాశాలు

వరుస అవకాశాలు

ఈ సినిమాలో ఆమె నటనకు గాను మంచి పేరు రావడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. దీంతో ఆమె కూడా వచ్చిన సినిమాల్లో చేసుకుంటూ వెళ్ళింది. కానీ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది కానీ చెప్పుకోదగ్గ సినిమాలయితే మరేమీ లేవు. ఈ నేపథ్యంలో ఇక సినిమాలు వర్కౌట్ కావని భావించిన ఆమె తన పూర్తిగా యాంకరింగ్ మీదకి దృష్టి మరల్చారు.

బిజీ యాంకర్ గా

బిజీ యాంకర్ గా


ఇక ఇప్పుడున్న యాంకర్స్ లో హాట్ యాంకర్ గా తెచ్చుకో పేరు తెచ్చుకున్న మంజూష ఇప్పటికే దాదాపు 2500 సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేసింది. గతంలో జెమినీ టీవీ ఆ తర్వాత మా టీవీలో పని చేసిన మంజూష ప్రస్తుతం ఈ టీవీ కోసం పని చేస్తోంది. అలాగే ఈటీవీలోనే కాక ఆమె సినిమా ఫంక్షన్స్ కి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి క్రేజ్ సంపాదించింది.

Recommended Video

Mega Hero Kalyaan Dhev’s New Film Titled a As ‘Kinnerasani’

ఆవకాయ పచ్చడితో హాట్ గా


సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఆమె యూత్ లో క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా ఆమె ఆవకాయ పచ్చడి పెడుతూ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆవకాయ పచ్చడి కలుపుతున్న ఫోటో పెట్టిన మంజూష వేడి వేడి అన్నంలో కలిపి కాస్త నెయ్యి తగిలించి తింటే అంటూ దేశముదురు సినిమాలో కోవై సరళ డైలాగ్ ను గుర్తు చేసింది. అంతా బాగానే ఉన్నా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమె పొట్టి బట్టలు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. దీంట్లో ఇంట్లో ఉన్నాఇంతేనా అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X