Rashmi Gautam: తెలుగు యాంకరమ్మ అందాల తెగింపు.. 36 ఏళ్ల వయుసులో ఆ షర్టు వేసి రచ్చ!
బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి గౌతమ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అటు సినిమాలతో పాటు ఇటు షోలు చేస్తూ బాగానే సంపాదించుకుంటోంది. డబ్బులతో పాటు ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అందాలు ఆరబోసింది. అందులో వైట్ కలర్ షర్టు వేసుకుని విదేశాల్లో వావ్ అనిపించే షో చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఈ ఫొటోల విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి గౌతమ్.. ఒడిశాకు చెందినది కాగా విశాఖపట్నంలోనే పుట్టి పెరిగింది. అయితే సినిమాల్లో నటించాలనే ఆశతో వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా 2002లో సవ్వడి అనే సినిమాతో కెరియర్ ప్రారంభించింది. కానీ ఆ సినిమా విడుదల కాకపోవడంతో.. ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన హోలీ సినిమాలోనూ సహాయ పాత్ర పోషించింది. ఇలా మంచి పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే.. మరోవైపు యాంకర్ గా కూడా రాణిస్తోంది.

ఓవైపు కెరియర్ లో ఫుల్ బిజీగా కొనసాగుతూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ తన అందాలను ఆరబోస్తుంటుంది. అలా నెటిజెన్లను ఫుల్ ఫిదా చేసేస్తూ తెగ రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను షేర్ చేసింది.
అందులో వైట్ కలర్ షర్టు వేసుకుని యమా క్రేజీగా ముస్తాబైంది. ముఖ్యంగా బ్లూ కలర్ జీన్స్ విత్ వైట్ షర్టులో హెయిర్ లీవ్ చేసింది. చెవులకు సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని స్టైలిష్ గా ముస్తాబైంది. అలాగే వైట్ కలర్ షూస్ స్టైల్ చేసి తన ఒంపుసొంపులు చూపించింది. పుట్టిన రోజు కోసం విదేశాలకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ వివిధ రకాల్లో ఫోజులు పెడుతూ ఫొటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా వైట్ షర్టులో ఎంతందంగా ఉన్నావో తెలుసా బ్యూటీ అని కొందరు.. 36 ఏళ్ల వయసు వచ్చినా నీ అందాలు మాత్రం 16 ఏళ్ల వద్దే ఆగాయని చెప్పుకొచ్చింది. ఇలా నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటోలను మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











