For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sravanthi Chokkarapu: బెడ్ మీద నుండి లేవలేని సిట్యుయేషన్.. దేవుని మీద భారం వేసి వెళ్తే పెద్ద అచీవ్మెంట్!

  |

  లైఫ్ లో ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో తెలియదు అంటోంది యాంకర్ స్రవంతి. ఈ టీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక షో ద్వారా పాపులర్ అయిన ఈ యూట్యూబ్ యాంకర్ తాజాగా ఒక బంపర్ ఆఫర్ అందుకొంది. ఇప్పటివరకు కేవలం కొన్ని ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు ఏకంగా మల్లెమాల సంస్థ కోసం ఒక షో నిర్వహించే అవకాశం దక్కించుకుంది. అయితే దీని వెనుక పెద్ద తతంగం నడిచింది అంటూ తన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చింది.. ఆ వివరాల్లోకి వెళితే

  ఊహించని విధంగా

  ఊహించని విధంగా


  యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారావు అనతికాలంలోనే తన గ్లామర్ తో మాటకారితనంతో మంచి పేరు తెచ్చుకుంది.. ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కోసం ఆమెను నిర్వాహకులు సంప్రదించారు. అలా ఎక్కువ ఇమ్మానియేల్ తో జంటగా కనిపిస్తూ వచ్చిన ఆమె అనతికాలంలోనే యూట్యూబ్ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంది.. అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఆ మధ్య హాట్ హాట్ ఫోటోలు పెడుతూ వచ్చిన ఈ భామ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే తాను ఊహించని విధంగా లైఫ్ లో ఒక అచీవ్మెంట్ వచ్చేసిందని ఆమె వెల్లడించింది.

  బెడ్ మీద నుండి లేవలేని సిట్యుయేషన్

  బెడ్ మీద నుండి లేవలేని సిట్యుయేషన్

  ఆమె పంచుకున్న సుధీర్ఘ సోషల్ మీడియా పోస్ట్ మీ కోసం అందిస్తున్నాం. ''కొన్ని రోజుల క్రితం నేను పేస్ చేసిన పరిస్థితి,అనుకోకుండా నా హెల్త్ చాలా బాలేకుండా అయ్యింది, కనీసం నేను బెడ్ మీద నుండి లేవలేని సిట్యుయేషన్, నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది, ఆ సిట్యుయేషన్ లో మల్లెమాల ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, బెస్ట్ ఆఫ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కోసం ఆడిషన్ ఉంది రావాలి అని, వాళ్లకి యాంకర్ ని తీసుకోవడం చాలా అర్జెంటు, నా ముందు రెండే ఎంపికలు ఆ రోజు, "Take the risk or lose the chance" ఇంట్లో వాళ్ళు అందరూ ఈ పరిస్థితి లో ఎందుకు లే వద్దు అన్నారు'' అని ఆమె తన ఇన్స్టా గ్రామ్ లో పేర్కొంది.

  దేవుని మీద భారం వేసి

  దేవుని మీద భారం వేసి

  ''అప్పటికే ఆ నెలలో వచ్చిన అన్ని ఆఫర్స్ ని వదిలేసుకున్నాను, ఏదైతే అది అయ్యింది అని దేవుని మీద భారం వేసి నా కష్టాన్ని నమ్మి వెళ్లాను ఆడిషన్ కి !! అక్కడికి వెళ్ళాక చూస్తే నాతో పాటు ఓ ఆరుగురు గురు అమ్మాయిలు కూడా వచ్చారు, అందరూ చాలా బాగా రెడీ అయ్యారు, ఫుల్ ఎనర్జిటిక్ గా డాన్స్ వేశారు, ఇంక నేను అనవసరంగా వచ్చాను, నేను కనీసం స్ట్రాంగ్గా నిలబడలేని పరిస్థితి అని నా మనసులో అనుకొని వెళ్లి నిలుచున్నాను, ఓ సాంగ్ ప్లే చేశారు ఏదో రెండు స్టెప్స్ వేసా మెల్లగా, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కూడా సక్సెస్ ఫుల్ గా చెప్పేశా''నని ఆమె వెల్లడించింది.

   అదో పెద్ద అచీవ్మెంట్

  అదో పెద్ద అచీవ్మెంట్

  ''అసలా రెండు గంటలు ఎలా గడిచాయో కూడా తెలీదు, నాతో వచ్చిన లేడీ అసిస్టెంట్ ఫుల్లు ఏడవడం మొదలు పెట్టింది, మీకు ఏమైనా జరగరానిది జరిగితే ఎలా అమ్మ అంది, ఏం కాదులే అమ్మాయి అంతా మంచే జరుగుతుంది లే అన్నాను, మొత్తానికి అయ్యాక ఇంటికి వచ్చేసాను, ఇంక నాకు రాదు లే అని ఫిక్స్ అయిపోయి ఆ రెండు రోజులూ ఆలోచిస్తూ ఉండిపోయాను, సడన్గా మళ్లీ మల్లెమాల నుండి మేనేజర్ కాల్ చేశారు, ఒకసారి ఆఫీస్ కి రండి సార్ మీతో మాట్లాడతారట అని, ఫైనల్ గా మీటింగ్ కి వెళ్లాను, మాట్లాడాను చాలా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు, మీకు ఈ షో చేయటం ఇష్టమేనా అని అడిగారు. ప్రోగ్రాం మీ దృష్టిలో చిన్నది అవ్వచ్చు, కానీ నాకు ఈ పరిస్థితిలో అదో పెద్ద అచీవ్మెంట్, మొత్తానికి నేను "take a risk once in a life ,never give up"అన్నది నమ్మాను'' అని స్రవంతి వెల్లడించింది.

  బిగ్ బాస్ లేనట్టే

  బిగ్ బాస్ లేనట్టే


  యాంకర్ గా ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి యాంకర్ గా పని చేసిన స్రవంతి మంచి పేరు తెచ్చుకుంది. మరిన్ని అవకాశాలు దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలాగే తన అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తోంది. నిజానికి ఆమె గతంలో మాటీవీ, జెమిని టీవీలలో సైతం వీజేగా కొన్ని షోస్ చేసింది. ఇక ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరగగా అదంతా నిజం కాదని ఈ పోస్ట్ తో తేలిపోయింది. ఎందుకంటే నిజంగా ఆ షోకి వెళ్ళే లా ఉంటే ఇప్పుడు ఈ షోకు ఆమె ఒప్పుకోదు కదా అంటున్నారు కొందరు. చూడాలి మరి ఏమవుతుందో ?

  English summary
  Telugu anchor Sravanthi Chokkarapu was selected as the anchor for Best of Extra Jabardasth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X