twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమాలో లిప్ లాక్.. త్రివిక్రమ్ చెప్పిన మాట, నాన్న ఇచ్చిన వార్నింగ్ మర్చిపోలేను: శ్రీ ముఖి

    |

    తెలుగు బుల్లితెరపై యాంకర్స్ హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. కేవలం మినీ స్క్రీన్ పైనే కాకుండా అప్పుడప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా వారి సత్తా చూపిస్తున్నారు. పటాస్ షో ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ అందుకున్న శ్రీ ముఖి కూడా అవకాశం వస్తే వెండితెరపై సత్తా చాటుతోంది. గ్లామర్ గీత దాటకుండా సేఫ్ జోన్ లో ఫోటోలకు పొజిస్తోంది.

    హద్దులు దాటకుండా..

    హద్దులు దాటకుండా..

    శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో రియాలిటీ షోలకు కాస్త దూరంగానే ఉంటోంది. అనసూయ, రష్మీ వంటి హాట్ యాంకర్స్ కి అమ్మడు తన గ్లామర్ షోతో హద్దులు దాటకుండా పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కెరీర్ మొదట్లో శ్రీ ముఖి నటిగా కొన్ని ప్రయత్నాలు చేసింది. ఇక జులాయి సినిమా ద్వారా శ్రీ ముఖి వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే.

    త్రివిక్రమ్ చెప్పిన మాట..

    త్రివిక్రమ్ చెప్పిన మాట..

    రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ ముఖి తన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలపై వివరణ ఇచ్చింది. తనకు ఎదురైన మంచి, చెడు అనుభవాల గురించి అలాగే దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన విషయం గురుంచి కుడా ప్రస్తావించారు. 'యాంకర్ గా కొనసాగుతున్న సమయంలో త్రివిక్రమ్ గారు ఒక మాట చెప్పారు. నువ్ టివి షోలు చేస్తే సినిమా ఆఫర్స్ రావని అన్నారు. చివరకు ఆయన చెప్పినట్లే అయ్యిందని శ్రీ ముఖి వివరణ ఇచ్చింది.

    లిప్ లాక్ సీన్ అన్నారు..

    లిప్ లాక్ సీన్ అన్నారు..

    "జులాయీ సినిమా చేసిన తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయి.. ఒక సినిమాలో హీరోయిన్ ఆఫర్ రాగా.. అందులో లిప్ లాక్ సీన్ చేయాలని, కొంచెం హాట్ గా కనిపించాలని అన్నారు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఇక మళ్ళీ సినిమాలు కూడా చేయలేదు. అప్పట్లో అదే నా చివరి సినిమా. ఇక సినిమాల్లో నటించవద్దని నాన్న కుడా అప్పుడు వార్నింగ్ ఇచ్చారు" అని శ్రీ ముఖి తెలిపింది.

    Recommended Video

    Anchor Sreemukhi Confirms Her Relationship
    యాంకర్ రవితో వెళ్ళినప్పుడు..

    యాంకర్ రవితో వెళ్ళినప్పుడు..

    కొన్ని సినిమాల ఆఫర్స్ ని రిజెక్ట్ చేయడానికి గల కారణాల చెప్పుకుంటూ వచ్చిన శ్రీ ముఖి యాంకర్ రవితో ఉన్న ఫ్రెండ్షిప్ పై కూడా వివరణ ఇచ్చింది. అతనితో ఎక్కడికైనా రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు కూడా తప్పుగా అనుకునేవారు. చాలా బాధగా అనిపించేది. అతను నాకు మంచి స్నేహితుడు అంటూ.. మా ఇద్దరికి పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరని శ్రీ ముఖి తెలిపింది.

    English summary
    In an interview Sri Mukhi explained some things about her personal life. He also mentioned the good and bad experiences, and the director Trivikram said about one thing for sreemukhi,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X