Don't Miss!
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Sreemukhi: మొదటిసారి శ్రీముఖి ఘాటైన గ్లామర్ షో.. లాగ్స్ అందాలతో స్టన్నింగ్
టెలివిజన్ రంగంలో ఒకప్పుడు యాంకర్స్ అనగానే ఎక్కువగా మాటలతో ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాటలతో పాటు గ్లామర్ తో కూడా ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇక తెలుగులో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారిలో శ్రీముఖి ఒకరు. రీసెంట్ గా శ్రీముఖి గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిసారి థైస్ అందాలతో షాక్ ఇచ్చింది.

సినిమాల్లో అలా..
మొదట సినీ నటిగా శ్రీముఖి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఆమె హీరో సిస్టర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆమె నటిగా పలు రకాల విభిన్నమైన సినిమాలు చేసింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే కాకుండా లీడ్ రోల్స్ కూడా చేసింది. కానీ ఆ రూట్లో ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు.

మొదట్లోనే మంచి ఛాన్స్ మిస్
యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు శ్రీముఖికి మొదట్లో కొన్ని మంచి ఆఫర్స్ వచ్చాయి. జబర్దస్త్ లో కూడా ఆమెకు యాంకర్ గా ఛాన్స్ వచ్చింది. కానీ అప్పట్లో ఆమే ఆ కామెడీ షోపై ఆసక్తి చూపలేదు. అప్పుడప్పుడే ఆ కామెడీ షో స్టార్ట్ అయ్యిందని పెద్దగా ఆసక్తిని చూపలేదు. ఆ తరువాత యాంకర్ అనసూయ, రష్మి అవకాశం దక్కించుకొని క్లిక్కయ్యారు.

యాంకర్ రవితో..
మొదట పటాస్ షో ద్వారా శ్రీముఖి మంచి క్రేజ్ అందుకుంది. యాంకర్ రవితో కలిసి చేసిన ఆ షోలో శ్రీముఖి ఒక వైపు అందంతో ఆకట్టుకుంటూనే మరోవైపు తన మాటలతో పంచ్ లతో డైలాగ్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. అప్పట్లో ఆ షోకు యూత్ లో మంచి క్రేజ్ దక్కింది కూడా శ్రీముఖి కారణంగానే. ఇక ఆ షో అనంతరం ఎన్నో షోలు చేసినప్పటికీ అవేవి కూడా అంతగా క్లిక్కవ్వలేదు

బిగ్ బాస్ ద్వారా
ఇక శ్రీముఖి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక అందులో ఆమె చివరి ఫైనల్స్ వరకు వెళ్లి బలమైన పోటీని ఇచ్చింది. ఇక చివరలో రాహుల్ సిప్లిగంజ్ కు ఆదరణ ఎక్కువగా పెరగడంతో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. ఇక ఆమె బిగ్ బాస్ విన్నర్ గా గెలవకపోయినప్పటికి కూడా రెమ్యునరేషన్ పరంగా భారీగా ఆదాయాన్ని అందుకున్నట్లు సమాచారం.

గ్లామర్ షో
ఇక గ్లామర్ విషయంలో శ్రీముఖి ఎప్పటికప్పుడు సరికొత్తగా హైలెట్ అవుతోంది. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెరిసే డ్రెస్ లో ఆమె లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ అందరిని స్టన్ అయ్యేలా చేసింది. ఇటీవల కాలంలో శ్రీముఖి ఎక్కువగా గ్లామర్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇండస్ట్రీలో బిజీబిజీగా
మొత్తానికి శ్రీముఖి మరోసారి గ్లామరస్ అందాలతో మతిపోగొట్టేసింది అని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఆమె ఒకవైపు రియల్టీ షోలు మరోవైపు సినిమాలు అంటూ చాలా బిజీగా కనిపిస్తోంది. త్వరలోనే ఒక డిఫరెంట్ లేడి ఓరియెంటెడ్ సినిమాతో శ్రీముఖి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఒక వెబ్ సీరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.