Sreemukhi: పొట్టి గౌనులో కిక్కిచ్చే అందాలు.. థైస్ షోతో దిమ్మదిరిగేలా స్టిల్స్!
యాంకర్ అనే పదానికి సరికొత్త అర్థం తీసుకువచ్చిన వారిలో శ్రీముఖి కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. రెగ్యులర్ హీరోయిన్స్ కు భిన్నంగా డిఫరెంట్ స్టైల్లో అలాగే గ్లామర్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్న శ్రీముఖి చాలా తొందరగానే క్లిక్కయ్యింది. ఇక సినిమాల్లో కూడా చాలా బిజీగా మారిపోయిన ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు గ్లామర్ విషయంలో మరింత హీటెక్కిస్తూ ఉండడం వైరల్ గా మారింది. ఇక లేటెస్ట్ గా ఒక చిన్న గౌనులో కూడా అమ్మడు తన లెగ్స్ అందాలను మరింత ఘాటుగా ప్రజెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో అలా చిన్న పాత్రలు
యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న శ్రీముఖి మొదట సినిమా ఇండస్ట్రీలో నటిగా కొనసాగాలని అనుకుంది. ఇక ఆమె 2012లోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన జులాయి సినిమాలో హీరో చెల్లెలిగా నటించిన శ్రీముఖి ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో కీలకమైన పాత్రలలో కనిపిస్తూ క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేసింది.

సినిమాలు చేస్తూనే..
శ్రీముఖి ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు బుల్లితెర పై కూడా బిజీ అవ్వాలి అని అనుకుంది. ఇక మొదట ఆమె 2013 లోనే అదుర్స్ షోలో యాంకర్ గా అవకాశం అందుకుంది. ఇక మొదటి షోకు మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత పటాస్ అనే షో ద్వారా శ్రీముఖి తన క్రేజ్ మరింత పెంచుకుంది. ఆ షో తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి.

వారికి పోటీని ఇచ్చే విధంగా
ఒకవైపు సినిమాలు మరోవైపు రియాలిటీ షోలో అంటూ చాలా బిజీగా మారిపోయిన శ్రీముఖికి సినిమా ఈవెంట్స్ లో కూడా హోస్ట్ గా చేసే అవకాశం దొరికింది. అంతేకాకుండా మరికొన్ని సినిమా అవార్డ్స్ ఫంక్షన్లలో కూడా శ్రీముఖి అవకాశం దక్కించుకుంది. ఇక అనసూయ రష్మీ టాప్ యాంకర్స్ గా కొనసాగుతున్న సమయంలో శ్రీముఖి ఒక్కసారిగా వారికి పోటీని ఇచ్చే విధంగా గ్లామర్ షో తో కూడా ఆశ్చర్యపరిచింది.

పవర్ఫుల్ లేడి
శ్రీముఖి ఊహించని విధంగా తెలుగు బిగ్ బాస్ 3 వ సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొని షాక్ ఇచ్చింది. తన స్థాయి అప్పుడు మరింత పెరిగింది అనే చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు శ్రీముఖి కేవలం యాంకర్ గానే అందరిలోనూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. కానీ బిగ్ బాస్ షో ద్వారా ఆమెలో ఒక మంచి పవర్ఫుల్ ఉమెన్ ఉంది అని నిరూపించుకుంది. ఆ సీజన్లో గెలవకపోయినప్పటికీ రాహుల్ కు పోటీని ఇచ్చి ఫైనల్స్ వరకు వెళ్లింది.

పొట్టి గౌనులో గ్లామర్ షో
ఇక ఈ మధ్యకాలంలో శ్రీముఖి గ్లామర్ తో కూడా ఊహించని విధంగా ఆశ్చర్యపరుస్తూనే ఉంది. రీసెంట్ గా అమ్మడు ఒక పొట్టి గౌనులో కనిపించిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇదివరకే చాలాసార్లు ఇంతకంటే ఘాటైన పోజులు ఇచ్చిన శ్రీముఖి ఈ డ్రెస్ లో మాత్రం చాలా అందంగా ఉంది అని ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

లెగ్స్ అందాలు హైలెట్
ఇక శ్రీముఖి పొట్టి గౌనులో వివిధ రకాల పోజులతో తన ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా లెగ్స్ అందాలు అయితే ఎన్నిసార్లు చూసినా చాలా అందంగా ఉంటుంది అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. శ్రీముఖి గ్లామర్ షో తో వెండితెరపై ఏదో ఒక రోజు షాక్ ఇస్తుంది అని కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రీముఖి రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











