వివాదంగా తేజస్వి అఫైర్.. భోరుమన్న దీప్తి.. సామ్రాట్‌కు శిక్ష.. కెప్టెన్‌గా కౌశల్!

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : 26th Episode Highlights

తెలుగు బిగ్‌బాస్ కార్యక్రమం ఆటపాటలతో, అఫైర్లతో జోరుగా సాగుతున్నది. సామ్రాట్, తేజస్విని ప్రేమాయణం మితిమీరి పోతున్నదనే మాట వినిపిస్తున్నది. అంతేకాకుండా వారి అతి రొమాన్స్ కూడా చర్చనీయాంశమవుతున్నది. హాస్టల్ టాస్క్‌లో లవర్స్ విజేతలుగా నిలిచారు. కెప్టెన్‌గా కౌశల్ ఎంపిక అయ్యారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 26వ రోజు ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

నాపై పడొద్దని సామ్రాట్ రెడ్డి

నాపై పడొద్దని సామ్రాట్ రెడ్డి

సామ్రాట్‌ రెడ్డి అంటే బిగ్‌బాస్ హౌస్‌లోని ప్రతీ ఒక్కరికి ఇష్టం అని వ్యాఖ్యలు చేసిన తేజస్వి మదివాడపై గీతామాధురీ, దీప్తి, శ్యామల, భానుశ్రీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. టాస్క్‌లో భాగంగా తనపైకి రావడంపై సామ్రాట్ స్పందిస్తూ నాపై పడొద్దు అని చేసిన వ్యాఖ్యలను కూడా వారు తప్పపట్టారు. బయట వాళ్లు వింటే ఏమనుకొంటారు అని వారందరూ వాపోయారు.

సామ్రాట్ నా వాడు.. తేజస్వి

సామ్రాట్ నా వాడు.. తేజస్వి

గీతా మాధురి, దీప్తి, శ్యామల వ్యవహారంపై తేజస్వి, సామ్రాట్, భానుశ్రీ మీటింగ్ పెట్టారు. వారేమనుకొన్న నాకు పట్టింపు లేదు. వీడు నా వాడు అంటూ సామ్రాట్‌పై తేజస్విని పడిపోయింది.

గణేష్ బెల్లి డ్యాన్స్

గణేష్ బెల్లి డ్యాన్స్

గీతామాధురి, శ్యామల, దీప్తి, సునైన మాట్లాడుతుండగా, అక్కడికి గణేష్ వచ్చాడు. దాంతో గణేష్‌ను బెల్లీ డాన్స్ చేయమని కోరగా లయబద్ధంగా నడుము, బొర్రను ఊపుతూ బెల్లీ డ్యాన్స్ చేశాడు. గణేష్ తోడుగా తేజస్విని కూడా బెల్లీ డాన్సు చేసి చూపించింది.

 రంగస్థలం పాటపాడిన గీత మాధురి

రంగస్థలం పాటపాడిన గీత మాధురి

సెలబ్రిటీలందరూ హాలులో కూర్చొని ఉండగా, రంగస్థలంలోని ఎంత సక్కగున్నవే అనే పాటను గీతామాధురి పాడి వినిపించారు. గీతా మాధురి పాట పడుతుండగా, సభ్యులందరూ చప్పట్లు కొడుతూ ఆమెకు ప్రోత్సాహం అందించారు.

 విజేతలుగా నిలిచిన లవర్స్

విజేతలుగా నిలిచిన లవర్స్

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా హాస్టల్ టాస్క్‌లో లవర్స్‌గా నటించిన జట్లకు బిగ్‌బాస్ అభినందన తెలిపారు. విజేతలుగా నిలిచిన కౌశల్-దీప్తి, సామ్రాట్-తేజస్విని కెప్టెన్ పదవికి కంటెస్టంట్లుగా ఉండాలని కోరారు.

 కెప్టెన్‌గా ఎంపికైన కౌశల్

కెప్టెన్‌గా ఎంపికైన కౌశల్

కెప్టెన్ పదవి ఎంపిక గురించి బిగ్‌బాస్ ఓ టాస్క్‌ను ఇచ్చారు. హీరోలు, విలన్లు అనే కాన్సెప్ట్‌తో నలుగురు మొనగాళ్లు గేమ్‌ను ఆడారు. గేమ్‌లో భాగంగా కుర్చీలో తాళ్లతో బంధించిన కొందరిని విడిపించాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువ మందిని విడిపించిన కౌశల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

సామ్రాట్‌ రెడ్డికి శిక్ష

సామ్రాట్‌ రెడ్డికి శిక్ష

కెప్టెన్‌ ఎంపిక టాస్క్‌లో బిగ్‌బాస్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించిన సామ్రాట్‌, రోల్ రైడాకు శిక్ష విధించాడు. స్విమ్మింగ్ పూల్ వద్ద రాత్రి వరకు నిలబడాలని ఇద్దరికి శిక్ష విధించడం గమనార్హం. అయితే రోల్ రైడాకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతడిని మినహాయించారు.

దొంగగా మారిన గీతామాధరి

దొంగగా మారిన గీతామాధరి

గీతా మాధురికి బిగ్‌బాస్ ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యులకు సంబంధించిన ప్రతీ ఒక్కరి వస్తువును దొంగిలించి పోస్టుబాక్సులో వేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ను సక్సెస్ ఫుల్‌గా గీతా పూర్తి చేసింది.

గుక్కపెట్టి ఏడ్చిన దీప్తి

గుక్కపెట్టి ఏడ్చిన దీప్తి

తేజస్వి, సామ్రాట్ అఫైర్‌పై కామెంట్ చేసినందుకు తనను షో నుంచి ఎలిమినేట్ చేస్తారా అనే అంశంపై దీప్తి నల్లమోతు కంగారు పడింది. కేవలం తేజస్విని కారణంగా ఇంటి నుంచి వెళితే బయట తాను తట్టుకోలేను అని దీప్తి గుక్కపట్టి ఏడ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X