Alekhya Harika; బికినీ ట్రీట్ తో దేత్తడి హారిక.. ట్రోల్స్ దెబ్బకు పోస్ట్ డిలీట్!

దేత్తడి హారిక గా సోషల్ మీడియాలో మొదటగా పాపులర్ అయిన అలేఖ్య హారిక ఆ తర్వాత తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. యూట్యూబ్ లో వివిధ రకాల వీడియోలు చేస్తూ మెల్లగా బిగ్ బాస్ వరకు కూడా ఆమె అడుగులు పడ్డాయి. ఇక తర్వాత ఆమె పేరు మరింతగా వైరల్ అయిపోయింది. సినిమాల్లో కూడా ఆమె అవకాశాలు అందుకోవాలని అనుకుంది. ఇక అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోలతో కూడా ఈ బ్యూటీ నెటిజెన్లకు షాక్ ఇస్తుంది. రీసెంట్ గా అలేఖ్య హారిక బికినీ ట్రీట్ తో మతిపోయేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ పేరుతో మరింత వైరల్

ఆ పేరుతో మరింత వైరల్

అలేఖ్య హారిక మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకుంది. ఆ తర్వాత ఆమెకు మెల్లగా క్రేజ్ పెరుగుతూ ఉండడంతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది. అనంతరం దేత్తడి హారిక పేరుతో మరింతగా వైరల్ అయ్యింది. మొదట్లో ఆమె వీడియోలకు మిలియన్ల వ్యూవ్స్ వచ్చేవి. తెలంగాణ భాషతో ఆమె డైలాగ్స్ చెప్పే విధానం కూడా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది.

గ్లామర్ తో కూడా క్రేజ్

గ్లామర్ తో కూడా క్రేజ్

యువతలో మంచి గుర్తింపును అందుకున్న అలేఖ్య హారిక మెల్లగా తన గ్లామర్ తో కూడా క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేసింది. సినిమాల్లో కూడా ఆమె అవకాశాలు అందుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ అలేఖ్యకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఏదో చిన్న చిన్న సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది కానీ అవి ఏమీ అంతగా వర్కౌట్ కాలేదు.

బిగ్ బాస్ ద్వారా..

బిగ్ బాస్ ద్వారా..

ఆలేఖ్య హారిక బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అందులో ఆమె కంటెస్టెంట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకొని టాప్ కంటెస్టెంట్స్ లో పోటీ పడింది. ఫైనల్స్ వరకు ఆమె అడుగులు పడినప్పటికీ కూడా చివరలో మాత్రం వెనదురగాల్సి వచ్చింది. కానీ బిగ్ బాస్ ద్వారా మాత్రం అలేఖ్య హారిక తన స్థాయిని పెంచుకుంది అని చెప్పవచ్చు.

మంచి రెస్పాన్స్ రావడంతో

మంచి రెస్పాన్స్ రావడంతో

అయితే అలేఖ్య హారిక బిగ్ బాస్ తర్వాత కొన్ని రోజుల వరకు మీడియాలో హాట్ టాపిక్ గానే నిలిచింది. ఇక ఇంటర్వ్యూలకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో తప్పకుండా సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది అని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని అనుకున్నంత స్థాయిలో అయితే అవకాశాలు రాలేదు. కానీ గ్లామరస్ ఫోటోలతో మాత్రం ఎప్పటికప్పుడు అమ్మడు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.

బికినీ తరహాలో న్యూ డ్రెస్

బికినీ తరహాలో న్యూ డ్రెస్

ఇక రీసెంట్గల్ గా అయితే అలేఖ్య హారిక ఒక డ్రెస్ లో మాత్రం షాక్ ఇచ్చింది. దాదాపు బికినీ వేసినట్లుగా ఉంది అని నిటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బికినీలా కనిపిస్తున్న టాప్ పైన అమ్మడు చిన్న పొట్టి నిక్కరు కూడా వేసుకుంది. కానీ దాన్ని డిజైన్ మాత్రం బికినీ తరహాలోనే ఉంది అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

మళ్ళీ డిలీట్ చేసిన హారిక

మళ్ళీ డిలీట్ చేసిన హారిక

ఇక బికినీ ఫోటో వేసిన దేత్తడి అలేఖ్య అంటూ సోషల్ మీడియాలో వివిధ రకాల ట్రోల్స్ రావడంతో ఆమె ఏమనుకుందేమో కానీ వెంటనే నిలబడి ఉన్న ఒక ఫోటోను మాత్రం డిలీట్ చేసింది. కేవలం టాప్ గ్లామర్ తో ఆకట్టుకునే విధంగా ఫోటోలను పోస్ట్ చేసింది. గ్లామర్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అలేఖ్య హారిక సినిమాల్లో అవకాశాలు అందుకోవాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మరి ఆమె అనుకున్నట్లుగా అవకాశాలు ఎప్పుడు వస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X