బిగ్‌బాస్ తెలుగులో కమల్ హాసన్.. నాగార్జునతో పలకరింపు.. షాకైన ఇంటి సభ్యులు..

బిగ్‌బాస్ తెలుగు షోలో అరుదైన సంఘటన కనిపించింది. ప్రముఖ నటుడు, దేశం గర్వించదగిన సినీ హీరో కమల్ హాసన్ ప్రత్యక్షమయ్యాడు. నవంబర్ 7వ తేదీన పుట్టిన రోజును జరుపుకొంటున్న కమల్ తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్ వేదిక మీద నుంచి పలకరించారు. ఈ సందర్భంగా ఇద్దరు మధ్య ఆరోగ్యకరమైన సంభాషణ జరిగింది. కమల్ హాసన్ కనిపించడంతో ఇంటి సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

ఇదిలా ఉండగా.. కమల్, నాగార్జున మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మీ ఇల్లు హౌస్‌ఫుల్‌గా ఉందంటూ కామెంట్ చేయగా.. అవును. నాకు అత్యంత ఇష్టమైన పదం అంటూ కమల్ హాసన్ సమాధానం ఇవ్వగా.. హౌస్‌ఫుల్ అనే పదం అంటే మన అందరికి ఇష్టం కదా అంటూ మాటల్లో పడిపోయారు. ఇది అపూర్వమైన కలయిక. కోట్లాది మంది ఈ షో ద్వారా కలుసుకొన్నారు. అందుకు ఆనందంగా ఉంది.

Telugu Bigg Boss Host Nagarjuna met Tamil Bigg Boss Host Kamal Haasan

తమిళంలో కూడా బిగ్‌బాస్ సీజన్ 4 కొద్ది వారాల క్రితం ప్రారంభమైంది. ఈ షోకు కమల్ వరుసగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు షోల షూటింగ్ సందర్సంగా ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలుసుకొని వందనాలు సమర్పించుకోవడం ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ సీజన్ 3లో కమల్ హాసన్ స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌ను సందర్శించారు. అప్పటి కంటెస్టెంట్లు కౌశల్, సామ్రాట్, రోల్ రైడా, తనిష్క్ ఇతర కంటెస్టెంట్లు ఆయనతో ముచ్చటించారు. తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఇంటి సభ్యులను పలకరించడం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X